హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్ భామ ఓపల్ సుచాత విన్నర్‌గా నిలిచారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని పొందారు. 107 దేశాల సుందరీమణులతో పోటీ పడి విజేత అయ్యారు. మిస్ వరల్డ్ టైటిల్ సాధించిన తొలి థాయ్‌లాండ్ జాతీయురాలిగా రికార్డ్ నెలకొల్పారు.

2003 సెప్టెంబర్ 20న థాయ్‌లాండ్‌లోని ఫుకెట్‌లో జన్మించిన ఈ అందగత్తె.. కజోన్‌కిట్సుకా స్కూల్లో ప్రైమరీ, సెకండరీ ఎడ్యుకేషన్ చదివారు. ప్రస్తుతం పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్‌లో డిగ్రీ చదువుతున్నారు. 2021 నుంచి అందాల పోటీల్లో పోటీపడుతున్నారు. గతంలో మిస్ యూనివర్స్ థాయ్‌లాండ్-2024 విజేతగా నిలిచారు.

