Monday, July 21, 2025
spot_img

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

Must Read

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం

అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి పాతికేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఏర్పాటుచేశారు. సెలబ్రేషన్స్‌కి వైదికైన డాక్టర్‌ పెప్పర్‌ ఎరినా ప్రాంగణం మొత్తం గులాబీమయమైంది. ఈ సంబరాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి పార్టీ శ్రేణులు, ఎన్ఆర్ఐలు ఘనంగా స్వాగతం పలికారు. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కూడా నిర్వహించనున్నారు. 2 రోజుల లండన్‌ పర్యటన ముగించుకొని కేటీఆర్‌ డాలస్‌ చేరుకున్నారు. పటిష్ట భద్రతతో ప్రత్యేక వాహనాల్లో విడిది ప్రదేశానికి చేరుకున్నారు. బీఆర్‌ఎస్‌ గ్లోబల్‌ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని పలు నగరాల నుంచి తెలంగాణవాదులు ఇప్పటికే డాలస్‌‌కి వచ్చారు.

Latest News

కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పాల‌న‌

ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రతిపక్ష అసత్య ప్రచారాలు నమ్మవద్దు రాజీవ్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ పీసీసీ మెంబర్ బండ రాంరెడ్డి “కాంగ్రెస్ ప్రభుత్వం వందలాది కుటుంబాల్లో ఆనందం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS