నవీన్ చంద్ర, హను రాఘవపూడి, వారాహి చలన చిత్రం కల్ట్ క్లాసిక్ “అందాల రాక్షసి” ఈ నెల 13న గ్రాండ్‌గా రీరిలీజ్ కాబోతోంది. ప్రేక్షకుల మనసుల్ని గెలిచిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మరోసారి అలరించబోతోంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్.ఎస్. రాజమౌళి నిర్మించిన ఈ చిత్రం 2012 ఆగస్టు 10న విడుదలై ఘన విజయాన్ని సాధించింది.
భిన్నమైన ప్రేమ కథ, లోతైన భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు హను రాఘవపూడి. రధన్ మ్యూజిక్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ గా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ మ్యాజిక్ మళ్లీ బిగ్ స్క్రిన్ పై ఎక్స్పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.