Friday, June 13, 2025
spot_img

పిల్లల కోసం.. ట్రంప్ పథకం..

Must Read

అగ్రరాజ్యం అమెరికాలో పుట్టే పిల్లల కోసం ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త పథకం ప్రవేశపెట్టారు. 2025-29 మధ్య కాలంలో జన్మించేవారి పేరిట వెయ్యి డాలర్ల పెట్టుబడి ఖాతాను ప్రభుత్వమే ఫ్రీగా తెరుస్తుంది. వీటినే ట్రంప్ అకౌంట్లు అంటారు. ఈ ఖాతాలను పిల్లల తల్లిదండ్రులే నిర్వహిస్తారని చెప్పారు. పేరెంట్స్ ఈ అకౌంట్లలో ప్రైవేట్ కంట్రిబ్యూషన్ కింద సంవత్సరానికి 5 వేల డాలర్ల వరకు డిపాజిట్ చేసే ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ నిధులు ముందు తరాల దీర్ఘకాలిక ఆర్థికాభివృద్ధికి తోడ్పడతాయని ట్రంప్ పేర్కొన్నారు. పిల్లలకు 18 ఏళ్లు నిండే దాక వడ్డీ జమ చేస్తారు. ఈ మేరకు పిల్లల తల్లిదండ్రుల్లో కనీసం ఒకరు వర్క్ ఆథరైజేషన్‌తోపాటు సోషల్ సెక్యూరిటీ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. సంబంధిత బిల్లును ప్రతినిధుల సభలో ఆమోదించారు. సెనేట్‌లో పాస్ అవ్వాలి. కానీ అక్కడ అంత సులభం కాదని అంచనా వేస్తున్నారు.

Latest News

సీఎం రేవంత్‌కి మాదిగ ప్రజాప్రతినిధుల ధన్యవాదాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన మంత్రులు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS