బడులు వానాకాలం ప్రారంభం.. విద్య వైద్యం వ్యాపారుల కబంధ హస్తాల్లో.. పాలకుల ఉదాసీనతలో ఉచిత విద్య, వైద్యం. ఆర్థికంగా నలిగిపోతున్నా ప్రశ్నించలేని ప్రజలు.. రాజ్యాంగం చెప్పింది పాలకులు చేయరా? అనుత్పాదక రంగాల్లో ఉచితాల వల విసిరి అధికారానికి వస్తారు. ప్రజలు అధికారాన్ని ఇస్తారు. విద్య, వైద్యంలో వ్యాపార దోపిడి గ్రహించనంత కాలం ఇంతే.
ప్రభుత్వాధీనంలోకి విద్య వైద్యాన్ని తీసుకొని, అనుచితాలను ఆపితే? దేశ ప్రగతికి, ప్రజారోగ్యానికి ఢోకా లేదు. సేవ పేరుతో అధికారాన్ని చేపట్టిన పాలకులు వ్యాపారుల పక్షమా? అధికారాన్నిచ్చిన ప్రజల పక్షమా? విద్య, వైద్యంలో వ్యాపారం వద్దు. నాణ్యమైన ఉచిత విద్య, వైద్యమే ముద్దు. అనుచితాలు వద్దే వద్దు. పాలకులు విసిరే ముసుగు (మాయ) వదిలించుకొని పాలితులు ప్రజా ఉద్యమం చేయాలి.
- మేదాజీ