Thursday, July 31, 2025
spot_img

రేపు గద్దర్ సినిమా అవార్డుల ప్రదానం

Must Read

గద్దర్ సినిమా అవార్డుల ప్రదానోత్సవాన్ని రేపు (జూన్ 14 శనివారం) సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ప్రతిఒక్కరూ చూసేలా ఏర్పాట్లు చేశారు. సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. 2014 నుంచి 2023 వరకు ఏటా మూడు బెస్ట్ సినిమాలను సెలెక్ట్ చేశారు.

ప్రతి మూవీకి హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాత.. ఈ నలుగురూ పురస్కారాలను అందుకోనున్నారు. 2024కు సంబంధించిన అన్ని అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ సెలబ్రేషన్స్‌కి హాజరుకావాలని కోరుతూ అందరికీ ఆహ్వానాలు పంపారు. అయితే.. ఈ ఆహ్వానపత్రం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గద్దర్ పేరుతో అవార్డులు ఇస్తూ ఇన్విటేషన్ కార్డు మీద మాత్రం ఆయన ఫొటోను ముద్రించలేదంటూ కొందరు తప్పుపడుతున్నారు. ఈ ఆహ్వానపత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Latest News

నో హెల్మెట్‌.. నో పెట్రోల్‌

ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరిస్తేనే పెట్రోల్‌ మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ జిల్లాలో ఆగస్టు 1 నుంచి అమలు రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో నెమ్మదిగాఈ విధానం అమలు మరి తెలంగాణలోనూ రోడ్డు ప్రమాదాలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS