Thursday, July 3, 2025
spot_img

పోచారం మున్సిపల్ కమిషనర్ కమీషన్ కంత్రి దందా

Must Read
  • అవినీతి అధికారులకు అధికార పార్టీ అండగా ఉండటం మరో దరిద్రం..
  • రాష్ట్రం అప్పుల్లో ఉందని ప్రజలకు పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి
  • రాష్ట్రం డెవలప్మెంట్ చేయాలంటే నిధులు లేవంటున్నారు..
  • నియామకాలు ఎలా చేయాలో అర్ధం కావడం లేదు..
  • మూడు పువ్వులు ఆరు కాయలుగా అవినీతి దందా చేస్తున్న కొంద‌రు అధికారులు

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ మండల పరిధిలోని, పోచారం మున్సిపల్, యన్నంపేట్ పరిధిలో ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి అక్రమ నిర్మాణాలే ప్రస్తుత దుస్థితికి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి.. స్టీల్త్ ప్లస్ టు అనుమతులు తీసుకొని ఎటు చూసినా ఏకంగా ఆరు అంతస్తుల భవన నిర్మాణాలు దర్శనం ఇస్తున్నాయి.. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చారాణా.. అవినీతి అక్రమార్కుల కమిషనర్లకు జేబులోకి బారాణా..

తెలంగాణా రాష్ట్రానికి వచ్చే ఆదాయంతో నీళ్లు, నిధులు, నియామకాలు అమలు చేయాలంటే చాలా కష్టంగా ఉంది అని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి అంటున్నారు.. తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది అవినీతి అధికారులు చేస్తున్న అక్రమాలపై ఆదాబ్ హైదరాబాద్ ప్రత్యేక కథనం..

వివరాలు ఒకసారి చూద్దాం.. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా, పోచారం మున్సిపల్ పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలే.. ప్రభుత్వ ఆదాయానికి రావాల్సిన పైకాన్ని స్థానిక మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి తన జేబు నిండితే చాలు అనుకుంటున్నాడేమో.. ప్రభుత్వం కష్టాల్లో, అప్పుల్లో ఉంటే నాకేంటి..? ప్రతినెల జీతం డబ్బుల తోపాటు అడ్డంగా వచ్చే కాసులతో లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు.. ఇక ప్రభుత్వం ఏమైతే నాకేంటి.. ఉన్నన్ని రోజులు దర్జాగా బ్రతకడమే లక్ష్యం అనుకున్నాడు ఇతగాడు..

పోచారం మున్సిపల్ పరిధిలో జరుగుతున్న అక్రమాలపై ‘ఆదాబ్ హైదరాబాద్’ వరుసకథనాలు ప్రచూరించినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం.. పైగా ప్రభుత్వానికి రావాల్సిన టాక్స్ వసూలు చేయకపోవడం.. ఇతగాడి నిర్లక్ష్య వైఖరికి నిదర్శనం.. మరి ఉన్నతాధికారులు ఎందుకు దృష్టి సారించలేకపోతున్నారు.. ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు..

మున్సిపల్ పరిధిలో ఉన్న కమిషనర్ల బదిలీలలో ఇతగారి పేరు ఉన్నా ఉన్నతాధికారులను మేనేజ్ చేసి అదే సీట్లో కూర్చొని సిస్టంకి సవాల్ గా మారాడు వీరారెడ్డి.. ఏదేమైనప్పటికీ పోచారం మున్సిపల్ పరిధిలోని యమనంపేట గ్రామంలో అక్రమ నిర్మాణాలపై పోచారం మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి అనుమతులకు మించి అదనపు అంతస్తులు ఏర్పాటు చేసిన నిర్మాణాలను సీట్ చేస్తారా..? లేక ముడుపులు తీసుకున్నాం కదా..? అంటూ గాలికి వదిలేస్తారా..? అయినా ఉన్నతాధికారులు నా చేతిలో ఉండగా ఇలాంటి వార్తా కథనాలకు భయపడేది లేదంటూ.. రెచ్చిపోతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తారా..? అనేది వేచి చూడాల్సిందే..

మున్సిపల్ కమిషనర్ వీరారెడ్డి
Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS