Thursday, July 3, 2025
spot_img

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

Must Read

బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి

ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హయ్యర్ ఎడ్యుకేషన్ ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని ధర్నాకు పిలిపించిన నేపథ్యంలో బీసీ విద్యార్థి సంఘం నేత లింగయ్య యాదవ్ తో పాటు వివిధ విద్యార్థి సంఘల ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు శ్రీకాంత్, నామా సైదులు, విజయ్ నాయక్, మధు యాదవ్, నవీన్ లను ఓయూ పోలీస్ అధికారులు ఉదయం ఓయూ రూమ్ ల్లోకి వచ్చి అకారణంగా అక్రమంగా అరెస్టు చేసి ఓయూ పీఎస్ కు తరలించడాన్ని బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి తీవ్రంగా ఖండించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అక్రమ అరెస్ట్ లు చేయకుండా ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థులను విద్యకు దూరం కాకుండా చూడాలని, అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి 80 వేల కోట్ల ఫీజు బకాయిలు ఇంటర్,డిగ్రీ,పీజీ,ఇంజనీరింగ్ కళాశాలలో వేలకోట్ల ఫీజు బకాయిలు విడుదల చేసి విద్యార్థుల ఉన్నత చదువులకు దోహదపడాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ని కోరుతున్నాం అన్నారు. కోర్సులు అయిపోయిన విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా యజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నవి అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా నాయకులు దేశగాని మహేష్, తండు నాగేష్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS