మనుషులు ఎందుకో.. మహా కౄరంగా మారుతున్నారు..
సాటి మనుషుల పట్ల పగా.. ప్రతికారాన్ని పెంచుకుంటున్నారు..
ప్రేమగా.. కలిసి బ్రతకాల్సిన వాళ్లు..
ప్రతికార జ్వాలతో రగిలిపోతున్నారు…
ఆత్మీయంగా ఉండాలన్న సోయి మరచి..
అరాచకాలు సృష్టిస్తున్నారు..
స్వల్పకాల జీవితానికి.. పగలు ద్వేషాలు అవసరమా..?
శాంతియుతంగా చర్చించుకుంటే…
హింసకు తావుంటుందా..?
- బొల్లెద్దు వెంకటరత్నం