Thursday, July 3, 2025
spot_img

హైటెక్స్ లో మూడు రోజుల పాటు దీప్ మేళా

Must Read
  • పోస్టర్ విడుదల చేసిన క్లబ్ సభ్యులు
  • దేశ నలుమూలల నుండి రానున్న ఉత్పత్తులు

హైదరాబాద్‌ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రీమియర్ షాపింగ్ ఎగ్జిబిషన్ దీప్ మేళా 2025 తేదీలు అధికారికంగా ప్రకటించబడ్డాయి. దీప్ శిఖా మహిళా క్లబ్ ఆధ్వర్యంలో ఈ మూడు రోజుల మేళా జూలై 18 (శుక్రవారం) నుండి 20 (ఆదివారం) వరకు హిట్‌ఎక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, హాల్ నం. 3, కోండాపూర్లో జరగనుంది. ఈ సందర్భంగా క్లబ్ కమిటీ సభ్యులు పోస్టర్‌ను అమీర్ పేటలోని కన్యా గురుకుల పాఠశాలలో విడుదల చేశారు. దీప్‌శిఖా మహిళా క్లబ్ హైదరాబాద్‌కు కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ మహిళా సేవా సంస్థ. 61 ఏళ్ల గా ఈ క్లబ్ సామాజిక సేవలో నిరంతరంగా నిమగ్నమై ఉంది. మహిళల అభివృద్ధి, బాలబాలికలకు నాణ్యమైన విద్య అందించడమే క్లబ్ లక్ష్యం. 1987 నుండి క్లబ్ వారు కన్యా గురుకుల హై స్కూల్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సుమారు 1700 మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నారు.

క్లబ్ కొత్త అధ్యక్షురాలు శ్రీమతి ప్రియాంక బహేటీ నాయకత్వంలో దీప్ మేళా కోసం సభ్యులు కార్యాచరణలో నిమగ్నమయ్యారు. గత మూడు దశాబ్దాలుగా నిర్వహిస్తున్న వార్షికంగా మూడురోజుల ఫండ్‌రైజింగ్ ఎగ్జిబిషన్గా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ మేళా ద్వారా సమాజ సేవా కార్యక్రమాలకు నిధులు సమీకరించి, స్థానిక వ్యాపారులను ప్రోత్సహించడమే ప్రధాన ఉద్దేశం.

ఈ ఏడాది దేశం నలుమూలల నుంచి 230కి పైగా స్టాళ్లలు ఈ మేళాలో పాల్గొంటున్నాయి. ఈ షాపింగ్ ఉత్సవంలో ఎలైట్ జువెలరీ, డిజైనర్ వేర్, హ్యాండీక్రాఫ్ట్‌లు, లైఫ్‌స్టైల్ ఉత్పత్తులు, గిఫ్ట్ ప్లాటర్లు, పోషకాహార ఉత్పత్తులు, హోం డెకో, స్కిన్‌కేర్ ఉత్పత్తులు, ప్రత్యేక రాఖీలు వంటివి ప్రధాన ఆకర్షణలు. అలాగే వివిధ రాష్ట్రాలకు చెందిన రుచికరమైన భోజనపు స్టాళ్లు కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డాయి.

దీప్ మేళా వివరాలు:
స్థలం: హాల్ నం. 3, హిట్‌ఎక్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, కోండాపూర్, హైదరాబాద్
తేదీలు: జూలై 18 (శుక్రవారం) నుండి జూలై 20 (ఆదివారం) వరకు
సమయం: ఉదయం 10:00 నుండి సాయంత్రం 8:00 వరకు
దీప్‌శిఖా మహిళా క్లబ్ కమిటీ 2025 – 2026:

  • అధ్యక్షురాలు: శ్రీమతి ప్రియాంక బహేటీ
  • మాజీ అధ్యక్షురాలు (ఐపిపి): శ్రీమతి రాధికా మలాని
  • ఉపాధ్యక్షురాలు: శ్రీమతి సంగీతా జైన్
  • కార్యదర్శి: శ్రీమతి భావనా సంగీ
  • కోశాధికారి : శ్రీమతి మినాక్షి భురారియా
  • సహాయ కార్యదర్శి: శ్రీమతి శివాని తిబ్రేవాల్
  • సభ్యురాలు: శ్రీమతి ఇందిరా డోచానియా
  • సలహాదారు: శ్రీమతి ఉషా సంగీ
Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS