Thursday, July 3, 2025
spot_img

లోపలికి రా చెప్తా.. టిక్ టాక్ చేద్దామా..

Must Read

సరికొత్త హారర్ కామెడీ మూవీగా ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది “లోపలికి రా చెప్తా” సినిమా. ఈ చిత్రాన్ని మాస్ బంక్ మూవీస్ పతాకంపై కొండా వెంకట రాజేంద్ర, మనిషా జష్నాని, సుస్మిత అనాలా, సాంచిరాయ్ హీరో హీరోయిన్లుగా లక్ష్మీ గణేష్, వెంకట రాజేంద్ర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కొండా వెంకట రాజేంద్ర హీరోగా నటించడమే కాకుండా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. “లోపలికి రా చెప్తా” చిత్రం ఈ నెల 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతోంది. తాజాగా ఈ సినిమా నుంచి నాలుగవ పాట ‘టిక్ టాక్ చేద్దామా..’ను యంగ్ టాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేశారు. ‘టిక్ టాక్ చేద్దామా..’ పాట ఈ సినిమాకు ఆకర్షణ కాబోతోంది.

టైటిల్ అనౌన్స్ మెంట్ నుంచే “లోపలికి రా చెప్తా” సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. మ్యూజిక్ డైరెక్టర్ దేవ్ జాండ్ కంపోజ్ చేసిన పాటలన్నీ ఛాట్ బస్టర్స్ అయ్యాయి. రీసెంట్ గా ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన “లోపలికి రా చెప్తా” ట్రైలర్ ను ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. హారర్ కామెడీ జానర్ లో ఈ సినిమా ఓ కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 5న థియేటర్స్ లోకి గ్రాండ్ రిలీజ్ కు వస్తున్న “లోపలికి రా చెప్తా” సినిమా విజయంపై మూవీ టీమ్ పూర్తి నమ్మకంతో ఉన్నారు.

నటీనటులు – కొండా వెంకట రాజేంద్ర, మనీషా జష్ణాని, సుస్మిత ఆనాల, సాంచిరాయ్, అజయ్ కార్తీక్, ప్రవీణ్ కటారి, రమేష్ కైగూరి, వాణి ఐడా, తదితరులు

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS