- 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి
- ఎమ్మెల్సీ కవితకు వినతిపత్రం
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యేవరకు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలని తార్నాక డివిజన్ గౌడ సంఘం (కౌండిన్య) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం టిఆర్‌ఎస్‌వి యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కూరెల్లి నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గౌడ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఏ విధంగా తీసుకొచ్చిందో అదే విధంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేలా చూడాలని అన్నారు. 42 శాతం రిజర్వేషన్ల కొరకు ఈనెల 17 వ తేదీన డెక్కన్ టు ఢిల్లీ వరకు కవిత చేపట్టిన రైలు రోకో కార్యక్రమానికి గౌడ్ సంఘం తరపున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈనెల జరిగే పార్లమెంట్ సమావేశంలో 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేలా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో తార్నాక గౌడ సంఘం అధ్యక్షుడు రంగు వెంకటేష్ గౌడ్, రాజు, సత్యనారాయణ, మహేష్, బాలమణి, భాస్కర్, జగదీష్, ఆంజనేయులు, నందు, ప్రశాంత్, శరత్, బాల్ రాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.