- అందిన ఉత్తర్వుల మేరకు ఆదేశాలు జారీ చేసిన దేవాదాయ శాఖ
- సుదీర్ఘ పోరాటం తర్వాత ఆలయ కమిటి ఏర్పాటు
- గుడి అభివృద్ధికై ముందుకు వచ్చే అందరినీ కలుపుకుంటూ పోతామన్న నూతన కార్యవర్గ సభ్యులు
- భక్తులపై గౌరవం – భగవంతునిపై భయం ఈ రెండు తప్ప ఎలాంటి ఆలోచన కమిటీకి ఉండబోదన్న నూతన చైర్మన్ ఇంద్రోజు ప్రదీప్ కుమార్ చారి
ముస్తాయిదుపురా లోని సాయిబాబా మరియు ఆంజనేయ స్వామి ఆలయానికి సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆలయానికి కమిటీ ఏర్పాటు చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. ఆలయ పవిత్రతను మరియు ఆస్తిని కాపాడడానికి ఇంద్రోజు ప్రవీణ్ కుమార్ చారి వర్గం ఎప్పటినుండో చేస్తున్న పోరాటం స్థానికంగా తెలిసిందే. ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టానికి తీపి కబురు అందింది అని ప్రదీప్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇదివరకు అడపా దడపాగా కమిటీ పేరు చెప్పుకొని పబ్బం గడిపిన వారిలా కాకుండా ఎలాంటి వారిపైన కూడా ప్రేమ ప్రతికారాలు లేకుండా కేవలం గుడికి వచ్చే భక్తులపై గౌరవం మరియు భగవంతునిపై భయంతో మాత్రమే తమ కమిటీ నడుచుకుంటుందని ప్రదీప్ కుమార్ నొక్కిమరి చెప్పారు. రాబోయే వారం రోజుల్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నామని అందులో తాను చైర్మన్ బాధ్యతలు చేపట్టగా, బండారి రాజేశ్వరరావు, మావూరి దయానంద్, ఎస్ సంతోషి బాయ్, డి సంతోష్ కుమార్, అశోక్ శుక్ల తదితరులు మిగతా బాధ్యతలు చేబడతారని ప్రదీప్ చారి వివరించారు.