మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడి
ఏపీలో ఎక్కడా లేని విధంగా ఆరునెలల్లోనే తాగునీటి ప్రాజెక్ట్ పూర్తి చేశామని మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఉరవకొండలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడారు. ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీటి సమస్యని శాశ్వతంగా పరిష్కరించామని తెలిపారు. ఉరవకొండ పట్టణానికి తాగునీరు అందించేందుకు జనవరి ఒకటోవ తేదీన తాగునీటి పైప్‌లైన్ పనులు ప్రారంభించామని మంత్రి పయ్యావుల కేశవ్ గుర్తుచేశారు. పనులు పూర్తి చేసి ప్రాజెక్ట్‌ని నేడు ప్రారంభించామని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. రూ.22కోట్లతో కేవలం ఆరునెలల్లోనే తాగునీటి ప్రాజెక్ట్ పూర్తిచేశామని తెలిపారు. ఆ రోజే తాను చెప్పానని.. తనను గెలిపించిన ప్రజలకు సేవకుడిగా పని చేస్తానని అన్నారు. ఈ రోజు ఏన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపించానని చెప్పుకొచ్చారు. వైసీపీ నేత వై. విశ్వేశ్వర్ రెడ్డి ఒక అసమర్థుడని చెప్పడానికి ఇదే నిదర్శనమని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు.