Wednesday, July 9, 2025
spot_img

వైశ్య విద్యార్థుల ఘన సత్కారం

Must Read

అవోపా బ్యాంక్‌మెన్ చాప్టర్‌ ఆధ్వర్యంలో బంగారు పతక అవార్డులు

ప్రతిభా వంతులైన వైశ్య విద్యార్థుల పోటీ తత్వాన్ని పెంపొందించడానికి అవోపా బ్యాంక్‌మెన్ చాప్టర్ హైదరాబాద్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు పతక అవార్డు ఫంక్షన్‌ ఘనంగా జరిగింది. ఖైరతాబాద్‌లోని వాసవి సేవా కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆర్‌.ఎస్‌.వి బద్రీనాథ్‌ అధ్యక్షత వహించారు.

ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి టి.జి వెంకటేశ్, డాక్టర్ కల్వ సుజాత, బోగ్గరపు దయానంద్‌ ముఖ్య అతిథులుగా హాజరై, తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎంసెట్‌, నీట్, జేఈఈ అడ్వాన్స్‌డ్ లలో ప్రతిభ చూపిన ర్యాంకర్లను బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. విద్యార్థుల కష్టపడి చదివి ర్యాంకులు సాధించడం గర్వకారణమని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కూడా ఆనందపడే విధంగా ఈ సత్కారం నిరంతరం కొనసాగుతుందని వారు అన్నారు. అతిథులు మాట్లాడుతూ విద్యలో మాత్రమే కాదు, జీవితంలోనూ ఈ పోటీ తత్వం కొనసాగించాలని, సమాజానికి సేవ చేసే విధంగా విద్యార్థులు ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. అవోపా బ్యాంక్‌మెన్ చాప్టర్ తరఫున పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం విద్యార్థుల ఆనందాన్ని రెట్టింపు చేసింది.

అవోపా బ్యాంక్‌మెన్ చాప్టర్ అధ్యక్షులు మాట్లాడుతూ, ప్రతీ సంవత్సరం ఈ విధమైన సత్కార కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో జ్ఞాన పిపాసను పెంచడం, సమాజంలో విద్యా రంగంలో వైశ్యుల గుర్తింపును మరింత ప్రదర్శించడం తమ లక్ష్యమని చెప్పారు. ప్రతిభగల విద్యార్థులు ఉన్న కుటుంబాలను గుర్తించి సాయం చేయడానికి కూడా సంఘం కృషి చేస్తోందని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. తాము సాధించిన విజయానికి సమాజం నుంచి గుర్తింపు రావడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు అన్నారు. ఈ ప్రోత్సాహం మరిన్ని విజయాలు సాధించడానికి ప్రేరణగా నిలుస్తుందని, రాబోయే రోజుల్లో ఉన్నత లక్ష్యాలు చేరుకోవడానికి మరింత కష్టపడతామని వారు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అవోపా నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు, పెద్ద సంఖ్యలో వైశ్య సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS