- హైదరాబాద్ అందంగా ఉంచటంలో జిహెచ్ఎంసి వర్కర్ల కీలకమైన పాత్ర: మంత్రి పొన్నం ప్రభాకర్
- వర్కర్లు కిట్స్ తప్పక సద్వినియోగం చేసుకోవాలి: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్ లో జిహెచ్ఎంసి శానిటేషన్ సిబ్బందికి ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి ఆరోగ్య పరీక్షలు చేసుకున్నారు. ఆరోగ్య పరీక్షలు చేసే క్యాంప్ లో అధునాతన యంత్రాలు, సిబ్బందికి ఇచ్చే మందులు తదితర వాటిని మంత్రి పరిశీలించారు.
అనంతరం జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బందికి వ్యక్తిగత పరికరాల కిట్స్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్.వీ.కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేసారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… హైదరాబాద్ మహానగరాన్ని జిహెచ్ఎంసి వర్కర్లు పరిశుభ్రంగా ఉంచుతున్నారని అన్నారు. జీహెచ్ఎంసీ లో పని చేస్తున్న ప్రతి శానిటేషన్ సిబ్బంది కి ఆరోగ్య పరీక్షలు చేస్తూ నెల వారి మందులు ఇచ్చే కార్యక్రమం ప్రారంభమైందని అన్నారు. మీ ఆరోగ్యాన్ని కాపాడడానికి తీసుకున్న నిర్ణయం లో భాగంగా మీ అందరి జీతాలు పెంచాలనే ఆలోచన ప్రభుత్వంలో ఉందన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు పోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మీ పట్ల సానుకూలంగా ఉన్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకు రానున్నట్లు మంత్రి తెలిపారు. అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, హైదరాబాద్ లో స్థలం ఉన్న వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కొన్ని స్లమ్స్ డెవలప్ చేస్తూ అక్కడ నిర్మాణాలు చేపట్టి మీకు ఇవ్వాలని ప్రణాళికలు చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కి పెట్టుబడులు వస్తున్నాయంటే పారిశుధ్ద్య కార్మికులు అద్దం లెక్క హైదరాబాద్ ను ప్రపంచానికి చూపెడుతున్నారన్నారు. మీ పిల్లలు చదువుకోవడానికి గురుకులాల్లో మెస్ చార్జీలు పెంచామని, రాష్ట్రంలో అర్హులకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మీ పిల్లలకు చదువులు ఇబ్బంది ఉన్న అధికారుల దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గురుకులాల్లో సీట్లు ఇచ్చి చదివించే బాధ్యత మాది అని పారిశుధ్య కార్మికులకు మంత్రి హామీ ఇచ్చారు.
ఆరోగ్యం రక్షించడానికి జీహెచ్ఎంసీ మీకు కిట్స్ అందిస్తుంది: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మాట్లాడుతూ… శానిటేషన్ సిబ్బంది తరచుగా ఆరోగ్య సమస్యలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ప్రభుత్వం అందజేసిన కిట్స్ ను తప్పక సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలకుండా ముందునుండే జాగ్రత్తలు పాటించాలని క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్మికుల ఆరోగ్యం విషయంలో జిహెచ్ఎంసి ప్రాధాన్యత నిస్తున్నట్లు తెలిపారు. కార్మికుల ఆరోగ్య పరిరక్షణ తో పాటుగా కార్మికులు అకాల మరణం పొందిన వృద్యప్య దృష్ట్యా పని చేయలేక పోయిన వారి కుటుంబ సభ్యుల కి తిరిగి ఉపాధి కల్పించేదుకు జి హెచ్ ఎం సి నిర్ణయం తీసుకున్నట్లు మేయర్ పేర్కొన్నారు. నగర వ్యాప్తి పెరిగినందున కార్మికుక సంఖ్య ను పెంచేందుకు చర్యలు తీసుకున్నట్టు మేయర్ తెలిపారు.
జిహెచ్ఎంసి కమీషనర్ ఆర్.వి కర్ణన్ మాట్లాడుతూ… శానిటేషన్ కార్మికులతో పాటుగా వెటర్నరీ, ఎంటమాలోజి విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు కూడా తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పంపిణీ చేసినట్టు కమీషనర్ పేర్కొన్నారు.
వర్షాకాలం కావడంతో శానిటేషన్ సిబ్బంది నిరంతరం ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటూ తమ ఆరోగ్యం కాపాడుకోవాలని, అందుకుగాను ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జిహెచ్ఎంసి పరిధిలో మొదటిసారిగా బంజారాహిల్స్ పరిధిలోని 450 మంది శానిటేషన్ సిబ్బంది జిహెచ్ఎంసి ఫ్రంట్ లైన్ వర్కర్లు భావించి వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు కు వెనుకాడకుండా ఆరోగ్య రక్షణ కు ప్రాధాన్యత ఇచినాట్కి చేస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు.ప్రభుత్వం అందజేసిన కిట్స్ లను తప్పక సవినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే జిహెచ్ఎంసి పరిధిలో ఎక్కువగా సిబ్బంది ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని కమిషనర్ స్పష్టం చేశారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య స్టాల్స్ లలో కంటి, పంటి, ఆర్థో, టి. బి, లేప్రసి, బి.పి, షుగర్, గైనిక్, బెస్ట్ క్యాన్సర్ వంటి టెస్టులు శానిటేషన్ వర్కర్లకు వైద్యులు చేపట్టి వైద్య సేవలను అందించినట్లు జిల్లా కలెక్టర్ హరి చాందస పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, జిహెచ్ఎంసి అదనపు కమిషనర్ రఘు ప్రసాద్, చీఫ్ మెడికల్ అధికారి డాక్టర్ పద్మజ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, టీబీ నివారణ అధికారి చల్లా దేవి, అదనపు డి ఎం అండ్ హెచ్ ఓ లు డాక్టర్ విజయనిర్మల, డాక్టర్ మురళీధర్, లెప్రసీ అధికారి డాక్టర్ రాధా కిషన్, తహసీల్దార్ అనిత రెడ్డి, జిహెచ్ఎంసి, అధికారులు, సిబ్బంది ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.