కేంద్రమంత్రికి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఖేలో ఇండియా నిధులివ్వాలంటూ కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయకు ఎపి సిఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగింది. బుధవారం కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయను రామ్మోహన్ నాయుడుతో కలసి చంద్రబాబు కలిశారు. అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో బ్యాడ్మింటన్ శిక్షణా కేంద్రం ఏర్పాటుకు సహకరించాలని కోరారు. అమరావతిలో జాతీయ జల క్రీడల శిక్షణ హబ్ ఏర్పాటుకు అవకాశం ఉందని, కృష్ణా నదీ తీరంలో వాటర్ స్పోర్ట్స్ శిక్షణా కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నాయని, తిరుపతి, రాజమహేంద్రవరం, కాకినాడ, నరసరావుపేటలో ఖేలో ఇండియా కింద నిధులిచ్చి మౌలిక సదుపాయాలను కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు.


