గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన సంఘటన సిద్ధిపేట జిల్లా, జగదేవపూర్ మండలంలో శుక్రవారం రోజున చోటుచేసుకుంది. జగదేవపూర్ మండలంలోని వట్టిపల్లి గ్రామానికి చెందిన కేతోజు సోమాచారి (55) పీర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో గత కొన్ని నెలల నుండి సోషల్ ఉపాధ్యాయుడుగా విధులను నిర్వహిస్తున్నాడు. రోజు మాదిరిగానే శుక్రవారం రోజున కూడా ఉదయం పాఠశాలకు చేరుకున్నాడు కొద్ది సమయంలో ఏమైందో తెలియదు ఒక్కసారిగా అతనికి ఛాతిలో నొప్పి రావడం గమనించి తోటి ఉపాధ్యాయులకు తెలుపగా అతనిని వెంటనే జగదేవపూర్ లోని ఓ .. ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా అక్కడున్న డాక్టర్ పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో తోటి ఉపాధ్యాయులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందినట్లు వారు తెలిపారు.అతనికి భార్య ,ఇద్దరు కుమారులు ఉన్నారు.