Sunday, October 19, 2025
spot_img

డెక్కన్ మానవ సేవా సమితి ప్రతినిధులకు తీవ్ర పరాభవం

Must Read

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి జాతరలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

అటు సనాతన ధర్మ పరిరక్షణ మొదలుకొని ఎటువంటి సామాజిక సేవకైనా ముందుండే వివాదరహిత సంస్థలో డెక్కన్ మానవ సేవా సమితి ఒకటి. నిరంతరం ఏదో ఒక సామాజిక సేవలో పాల్గొనే ఈ సంస్థ కొన్ని దశాబ్దాలుగా సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి జాతరలో తమ స్వయం సేవకులతో సేవలు అందిస్తుంది. ఈ స్వయంసేవకుల ఎంపికలో కూడా ఎన్నో జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. ముఖ్యంగా ఎలాంటి వివాదాస్పద చర్యల్లో పాల్గొనని వారు, సమాజంలో బాధ్యతాయుతంగా మెలిగే వారు ఇందులో ఉంటారు. ఎంతోమంది నవ యువకులను ప్రోత్సహించి, శిక్షణ ఇచ్చి అమ్మవారి జాతరలో స్వయం సేవకులుగా నియమించి, వారికి జాతర అనంతరం ప్రోత్సాహకాలు కూడా అందిస్తారు. దాదాపు మూడు దశాబ్దాల కు పైగా సేవలందిస్తున్న బృందానికి గుడి లోపల తీవ్ర పరాభవం ఎదురయింది.

మాతమ్మ వద్ద బోనాలు స్వీకరించే వారు సరైన అనుభవం లేకనో మరే ఇతర కారణాల వల్లనో కానీ అక్కడ త్వరగతిన కార్యక్రమం పూర్తి చేయకపోవడం వల్ల వెనకాల బోనం ఎత్తుకొని నిలబడిన మహిళా భక్తులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుందని డెక్కన్ మానవ సేవా సమితి బృందం గమనించింది. వెంటనే వాళ్లు నాలుగు బృందాలుగా ఏర్పడి, బోనాలు స్వీకరించి ఆ మహిళా భక్తులను అమ్మవారి దర్శనానికి పంపే ప్రక్రియను వేగవంతం చేశారు. అక్కడ ఉన్న మహిళా పోలీసులను సైతం అది గమనించి వారికి తోడ్పడ్డారు. కానీ ఒక పోలీసు ఆఫీసర్ వచ్చి ఈ డెక్కన్ మానవ సేవా సమితి వాళ్లు మహిళలను అసభ్యకరంగా తాకుతున్నారని ఆరోపించారు. వెంటనే అక్కడినుండి ఖాళీ చేయమని హెచ్చరించారు. తాము అమ్మవారి భక్తులమని, పైగా అమ్మవారి ఎదుట మహిళలను ఎలాంటి దుర్బుద్ధితో చూడమని, గత 30 సంవత్సరాలుగా తాము ఈ సేవ చేస్తున్నామని సమర్థించుకున్నారు.

అమ్మవారి గుడి ఒళ్లో పుట్టి పెరిగిన తమని అలా కించపరచి అవమానించడం పోలీసులకు తగదని విన్నవించుకున్నారు. అప్పుడు ఆ పోలీసు ఆఫీసర్ ఏమీ మాట్లాడక మరొక అధికారిని పంపించి అదే విషయమై వారిని అక్కడినుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. ఇది నిజంగా తమకు తీరని అవమానమని, గత 30 సంవత్సరాలుగా ఏనాడు కూడా ఇలాంటి క్షోభకు గురి కాలేదని, తమ వ్యక్తిత్వం పైనే పోలీసులు అబాండం వేయడం తమకు, తమ తమ కుటుంబ సభ్యులకు జీర్ణించుకోలేని విషయమని, తలదించుకొని అక్కడి నుండి డెక్కన్ మానవ సేవా సమితి వాళ్లు తప్పుకున్నారు. ఇక ఈ విషయమై డిక్కెన్ మానవ సేవా సమితి యాజమాన్యం పోలీసులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This