జగన్ తీరుపై మండిపడ్డ మంత్రి పార్థసారథి
గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసం, పోలవరం, నీటిపారుదల ప్రాజెక్టుల అంశంలో తప్పిదాలపై ప్రజల దృష్టి మరల్చడానికి వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషం చిమ్ముతున్నారని మంత్రి పార్థసారథి విమర్శించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వం విూద విమర్శలు చేస్తూ.. అబద్దాలే పునాదిగా చేసుకొని పబ్బం గడుపుకునేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని మంత్రి పార్థసారథి అన్నారు. కేవలం రాజకీయలబ్ధి కోసమే ఇదంతా చేస్తున్నారని ఆయన విమర్శించారు. తమిళనాడులో పార్టీలు రాజకీయంగా విభేదించినా.. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి పని చేస్తాయని ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇక్కడ మాత్రం స్వార్థ పూరిత ప్రతిపుక్ష ఉండటం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 70 శాతం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసినా.. గత జగన్ సర్కారు ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయిందని ఎద్దేవా చేశారు. జగన్.. ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు.. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు.. అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి.. ఆ ప్రయోజనాలు రైతన్నలు పొందేలా చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. వైఎస్ జగన్ బాధ్యత గల రాజకీయ నాయకుడిగా పనిచేయాలని ఆయన హితవు పలికారు. రఫ్ఫా.. రఫ్ఫా నరికేస్తు.. పొడి చేస్తాం అంటున్నారు.. పోలీసులు సక్రమంగా పనిచేయకూడదని, విద్వేష పూరిత ప్రసంగాలు చేస్తున్నారు, పోలీసులుపై కించపరిచేలా మాట్లాడుతున్నారని మంత్రి విమర్శించారు. జగన్.. మీడియాను టిష్యూ పేపర్‌తో పోల్చారంటే.. మీడియాపై ఆయనకి ఎలాంటి గౌరవం ఉందో చూడండని మంత్రి అన్నారు. జగన్ కి ఏ వ్యవస్థ మీద గౌరవం లేదు.. ఈ రాష్ట్రానికి నిధులు, పెట్టుబడుదారులు ఎవరూ రాకూడదని ఇలా చేస్తున్నారని మంత్రి చెప్పారు. ఈ విద్వేషాల్ని ప్రజలు గమనిస్తున్నారని, కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖలో అభివృద్ధి పరుగులు పెడుతోందని మంత్రి చెప్పుకొచ్చారు.