Sunday, July 20, 2025
spot_img

తెలంగాణ‌లో డైవర్షన్‌ పాలిటిక్స్‌

Must Read
  • ఒక్క కేసులోనూ ఆధారం చూపలడం లేదు
  • సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ మరోమారు విమర్శలు

తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని.. చివరికి గుండు సూదంత ఆధారం చూపలేదని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు. ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పార్టీ నేతలతో కలిసి మాట్లాడారు. ధైర్యం ఉంటే ఏం ఆధారాలు ఉన్నాయో బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు. దుబాయ్‌లో ఎవరో చనిపోతే నాకేం సంబంధం. దురలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలి. నేను జీవితంలో ఏనాడూ సిగరెట్‌ కూడా తాగలేదు. సీఎం రేవంత్‌రెడ్డి నాపై ఎన్నో ఆరోపణలు చేశారు. నేను ఏం చేసినా.. బాజాప్త చేస్తా. నేను ఏపీ మంత్రి లోకేశ్‌ను కలవలేదు.. ఒక వేళ కలిసినా తప్పేంటి? నారా లోకేశ్‌ నాకు మంచి మిత్రుడు.. ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆయన పక్క రాష్ట్రం మంత్రి.. నాకు తమ్ముడి లాంటి వారు. డైవర్షన్‌ పాలిటిక్స్‌ తప్ప.. రేవంత్‌రెడ్డి 20 నెలల్లో చేసింది శూన్యం.

నా విషయంలో ఓసారి డ్రగ్స్‌ అంటారు, ఓ సారి కార్‌ రేసింగ్‌ అంటున్నారు. రేవంత్‌రెడ్డి వల్ల యూట్యూబర్లకు మినహా ఎవరికీ లాభం చేకూరలేదు. గాసిప్‌ల మాయలో పడి.. ఆరు గ్యారంటీలను మర్చిపోదామా? బనకచర్ల విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి అడ్డంగా దొరికిపోయారు. దిల్లీ భేటీ అజెండాలో బనకచర్ల అంశమే లేదన్నారు. దిల్లీ కేంద్రంగా రాష్ట్రానికి మరోసారి ద్రోహం చేశారు. చంద్రబాబుతో చీకటి ఒప్పందం చేసుకున్నారు. 420 హామీల విషయంలో కాంగ్రెస్‌తో ఫుట్‌బాల్‌ ఆడటం ఖాయం అని కేటీఆర్‌ అన్నారు. శక్రవారం కేటీఆర్‌ ఖమ్మం జిల్లాలో పర్యటించారు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌ కుమార్‌ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి మంత్రుల ఫోన్లు ట్యాప్‌ చేయిస్తున్నారని ఆరోపించారు. తన ముఖ్యమంత్రి సీటుకు ఎసరు పెడుతున్నారనే భయంతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల ఫోన్లు ట్యాప్‌ చేయించడం లేదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. త్వరలోనే ఆధారాలతో సహా అన్నీ బయటపెడతా అని అన్నారు. రేవంత్‌ ప్రెస్‌విూట్‌కు యువత దూరంగా ఉండాలను సూచించారు. రేవంత్‌ పిరికి సన్నాసాని.. చర్చకు రమ్మంటే పారిపోతున్నాడని ఫైరయ్యారు.

రేవంత్‌రెడ్డి మానసిక రుగ్మతతో బాధపడుతున్నారని… చిట్‌చాట్‌లో చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్‌లా తాను దొంగను కాదని.. సంచులు మోయలేదని అన్నారు. బనకచర్లపై చంద్రబాబును కలవబోనని చెప్పి.. ఢిల్లీలో కలిసి దొరికారని అన్నారు. గోదావరి జలాలను చంద్రబాబుకు అప్పజెప్పి తెలంగాణకు ద్రోహం చేశారని మండిపడ్డారు. ఢిల్లీలో దొరికిన దొంగ అటెన్షన్‌ డైవర్షన్‌ కోసమే పిచ్చివాగుడు వాగుతున్నదని సీఎంపై నిప్పులు చెరిగారు. రేవంత్‌రెడ్డి తప్పు చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS