తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మొదటి పర్యటన
రామచందర్ రావు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఢిల్లీ పర్యటించారు. ఈ సందర్భంగా, ఢిల్లీలో రాష్ట్ర కోఆర్డినేటర్ నూనె బాల్‌రాజ్ ఆయనకు ఘన స్వాగతం పలికారు.
ఈ పర్యటనలో, బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయ పరిణామాలు, బీజేపీ కార్యాచరణ మరియు భవిష్యత్ వ్యూహాలపై విలేకరులకు సమగ్రంగా తెలియజేశారు.