Thursday, July 24, 2025
spot_img

నిఘా నిదరోతుంది..

Must Read
  • జిల్లాలో పెట్రోలింగ్ మరిచిన పోలీసులు..
  • వాహనాల వెంట పరుగులు, వసూళ్ల వైపే అడుగులు..
  • బంగారం దొంగలను పట్టుకోవడానికి ఖాకీల తిప్పలు..
  • పేట పోలీసులకు బంగారం దొంగలు చిక్కెనా.?

సూర్య‌పేట పోలీసులు నిఘా మరిచారు. వాహనాల వెంట పరుగులు పెడుతూ, కేవలం వసూళ్ల పైనే ద్రుష్టి సరించారన్న ఆరోపణలు జిల్లా ప్రజలలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. జిల్లా పోలీసులు లు నిఘా పై దృష్టి పెట్టడంలో విఫలమయ్యారనే చెప్పవచ్చు. బంగారు నగలు ఆపహరణ కేసు పేట పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ఈ కేసును ఎలాగైన చెధించి తీరాలని జిల్లా ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో రెండు రోజుల క్రితం సాయి సంతోషి జ్యువెలరీ షాప్ లో 18 కిలోల బంగారం ఆభరణాలు, రూ 20 లక్షలు నగదు, రూ. 40 లక్షల బిస్కెట్ బంగారం చోరీ కి గురికాగా, ఉత్తర ప్రదేశ్ జార్ఖండ్ కు చెందిన దోపిడీ ముఠా సభ్యుల పనేనాని ఇప్పటికే పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.జ్యువెలరీ యజమాని 18 కేజీలు బంగారం చోరీ కి గురైందని చెప్తుండగా, అది కాస్త సోమవారం సాయంత్రానికి 9 కిలో లే నని, అది కాస్త మూడు కిలోలు చోరీకి గురైందంటూ పోలీసులు చెప్తున్నారు. ఇంతకు పోయిన బంగారం ఎంత.? క్యాష్ ఎంత.? అనే అనుమానాలు జిల్లా ప్రజలలో పలు రకాల ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి.

బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు..
బంగారం అపహరణ జరిగిన వెంటనే సోమవారం సాయంత్రం ఐదు బృందాలుగా విడిపోయిన జిల్లా పోలీసులు, ఉత్తర ప్రదేశ్ జార్ఖండ్ కు రెండు టీం లు వెళ్లినట్లు తెలుస్తుంది. మరో మూడు బృందాలు రోడ్డు మార్గాన ఖమ్మం మీదుగా వెళ్లారు. అలాగే జార్ఖండ్ కు చెందిన వారు చోరీకి గురైన బంగారం షాపు నుండి, 50 మీటర్ల దూరంలో ఉన్న పాత ఇంట్లో ఐదుగురు వ్యక్తులు అద్దెకు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ ఇల్లును పోలీసులు క్లూస్ టీం పరిశీలించగా ఆ ఇంట్లో బంగారపు పూసలు లభ్యమవడంతో, పోలీసులకు కొంత బలం చేకూరినట్టు అయ్యింది. అయితే ఇంటిని అద్దెకు ఇచ్చిన వ్యక్తిని,పోలీసులు వెంట తీసుకుని వెళ్లినట్లు తెలుస్తుంది. యూపీ కి చెందిన ఈ ముఠా పక్కా ప్లాన్ తో చోరీ చేసి హరారయ్యారు. జిల్లా నుండి వెళ్లిన పోలీసులు ఆ ముఠాని పట్టుకుంటారా లేదా అనేది జిల్లా ప్రజలకు చాలా ఆసక్తికరంగా మారింది.

భద్రత వదిలి, వసూళ్లపైనే దృష్టి..
సూర్యాపేట జిల్లా రెండు తెలుగు రాష్ట్రలా రాజధానులకు మధ్య వారధిగా ఉంది.ఇలాంటి జిల్లా కేంద్రంలో గత సంవత్సరం నుంచి పోలీసులు నిఘా మరిచిపోయారు. నిఘాను పరిశీలన చేయాల్సిన అధికారులు (అక్రమ వ్యాపారాలపైనే దృష్టి) మామూళ్ళ మత్తులో ఉండిపోయారు. జిల్లా పోలీసుల అధికారుల వ్యవహార శైలి పై అనీశా అధికారుల సైతం నిఘా పెట్టి పట్టుకున్న విషయం తెలిసిందే. కానీ పోలీస్ లు జిల్లా కేంద్రంపై నిఘా పెట్టడంలో పూర్తిగా విఫలం అయ్యారనే చెప్పవచ్చు. గతంలో బ్లూ కోర్ట్, 100 కాల్ సిబ్బంది రోజు రాత్రి వేళలో పెట్రోలింగ్ చేసేవారు. ఇప్పుడు గత సంవత్సర కాలంగా జిల్లా కేంద్రంలో పెట్రోలింగ్ చేయడమే మరిచారు. పెట్రోలింగ్ సిబ్బంది ఎదో చోట వాహనాన్ని నిలపడం లేదా, వచ్చిపోయే వాహనాల వద్ద వసూళ్లు తప్ప మరో ఆలోచన లేదనే ఆరోపణలు ఉన్నాయి. గతంతో పోల్చుకుంటే జిల్లాలోని అన్ని పిఎస్ లలో చాలా తక్కువగా ఉండేది. అయినా ఉన్న సిబ్బందితోనే పెట్రోలింగ్ నిర్వహించేవారు. కానీ ఇప్పుడు జిల్లాకు సరిపోను సిబ్బంది ఉన్నప్పటికీ కూడా, ఎంతసేపు చలాన్ లు, వసులు పై ఉన్న ధ్యాస,ప్రజల భద్రత మీద లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. అలాగే పెట్రోలింగ్ చేస్తున్నారా లేదనే దానిపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కుడా, టైం కు వచ్చి ఎదో చోట వాహనాన్ని నిలిపి నిద్ర పోతున్న దుస్థితి నెలకొంది. ఏదీ ఏమైనా జిల్లా కేంద్రంలో పెట్రోలింగ్ వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Latest News

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే పిఎ హరిబాబు రిమాండ్‌

డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని 83 మంది వద్ద నుంచి రూ.84 లక్షల వ‌ర‌కు వసూలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తానని హామీ ఇచ్చి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS