రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతూ వున్నాయి.అల్ప పీడనం ఏర్పడి తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాకాలం లో అపరిశుభ్రతకు ఏమాత్రం తావు ఇచ్చిన మనం మలేరియా, టైఫాయిడ్,జ్వరం డెంగ్యూ, చికెన్ గున్యా వంటి ప్రాణంతకర వ్యాధుల బారినపడటం జరుగుతోంది.,ఇక మనమంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు మన ఇంటిని, మన ఇంటి పరిసరాలను సైతం అత్యంత శుభ్రంగా పెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా వుంది. ఎందుకంటే మనం ఈ వర్షాకాలంలో ఏమాత్రం అపరిశుభ్రతకు తావు ఇచ్చిన, మన ఇంటి ఆవరణలోని గుంతలలోను, మనం తీసి పారేసిన వస్తువుల లోను మురికినీరు నిల్వ ఉండేందుకు ఏమాత్రం అవకాశం ఇచ్చినా అవి దోమలకు నివాసాలుగా మారడం తో పాటు అవి మన ఇంటిలో తిష్టవేసి తద్వారా డెంగ్యూ, మలేరియా,చికెన్ గున్యా, డయేరియా వంటి వ్యాధులు మనపై దాడి చేసి మన రోగ నిరోధక వ్యవస్థ ను అత్యంత దారుణంగా తీసేందుకు ఎక్కువగా అవకాశం ఉంటుంది.ముఖ్యంగా దోమ కాటు వల్ల ప్రబలే డెంగ్యూ వ్యాధి అత్యంత ప్రమాదకరమైనది, ఇది మనకు పొరపాటున సోకితే మాత్రం మనకు తీవ్ర తల నొప్పులు, కండరాల, కీళ్ల నొప్పులు రావడం తో పాటు, విరోచనాలు, వాంతులు, చర్మం పై దురదలు వంటివి ఏర్పడి ఒక్కొక్కసారి ఆ వ్యాదికి సకాలం లో చికిత్స తీసుకోకపోతే అది మనకు ప్రాణాoతకరంగా సైతం మారే ప్రమాదం పొంచి వుంది. ముఖ్యంగా ఈ సీజనల్ వ్యాధులు మన ఇంటిలోని చిన్నారులపై ఎక్కువగా ప్రభావం చూపి వారి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చుపుతూ ఉంటాయి.
అదేవిధంగా మన ఆరోగ్యాన్ని అస్తవ్యస్థం, అదొగతిపాలు చేసే ఈ సీజనల్ వ్యాధులు మన దరి చేరకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మన చేతులను శుభ్రం చేసుకుంటూ, మన ఇంటి లోకి దోమలు ప్రవేశించడానికి వీలులేకుండా దోమ తెరలు, జెట్ వంటివి వాడుకుంటూ తగు జాగ్రత్తలు పాటిస్తే అది మనకు, మన కుటుంబసభ్యుల ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. ఏదిఏమైనా ‘ ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యాన్ని మరో పదికాలాల పాటు కాపాడుకోవాలంటే మాత్రం ఈ వర్షాకాలం లో ప్రబలే సీజనల్ వ్యాధులు మన దరి చేరకుండా అత్యంత అప్రమత్తంగా మసలుకోవడం మన ఇంటికి, వంటికి మంచిది. ఏమైనా ఈ వర్షాకాలం లో మన ఆరోగ్యం పట్ల ఏమాత్రం అశ్రద్ధ, నిర్లక్ష్యం కనబరచిన సీజనల్ వ్యాధులు చుట్టూముట్టి మనల్ని ఆసుపత్రుల పాలుచేయడం తో పాటు వేలాది రూపాయలు ఖర్చు అయిపోయి ఆర్థికంగా సైతం మనం చితికిపోయే ప్రమాదం పొంచి వుంది. కాబట్టి మనమంతా పరిశుభ్రత పాటించి మనతో పాటు మన కుటుంబసభ్యుల ఆరోగ్య పరిరక్షణకు పాటుపడదాం. మన విలువైన ప్రాణాలను కాపాడుకుందాం.వేడి చేసిన,కాచి చల్లార్చిన నీటిని అధికంగా తాగుదాము,వేడి వేడి అన్నం,కూరలను ఆరగించి,రోడ్ల మీద ఆమ్మే తినుబండారాలను తినకుండా ఉండడం వల్ల అనేక రోగాలకు దూరంగా ఉండవచ్చు.
కామిడి సతీష్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, 9848445134