రెండు దశాబ్దాల క్రితం మన్మథుడు సినిమాతో యువతను కట్టిపడేసిన ఆ నటి మీ అందరికి గుర్తుండే ఉంటంది.. ‘మన్మథుడు’ సినిమాలో కామెడీ డైలాగ్స్ మాత్రమే కాకుండా హీరోయిన్ అన్షు కూడా సినిమాను ఓ రేంజ్‌కు తీసుకెళ్లింది. ఎందుకంటే మూవీలో ఉన్నది కాసేపే అయినా తన అందంతో మెస్మరైజ్ చేసింది. అయితే మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తుందని అనుకుంటే.. సడన్గా పెళ్లి చేసుకుని యువతకు షాకిచ్చింది. దేశమే వదిలేసి వెళ్లిపోయింది. అన్షు సగ్గర్ 2000ల ప్రారంభంలో తెలుగు సినిమాల్లో తన నటనకు ప్రసిద్ధి చెందిన బ్రిటిష్ భారతీయ నటి . నాగార్జునతో కలిసి బ్లాక్ బస్టర్ రొమాంటిక్ కామెడీ మన్మధుడు (2002)లో మరియు ప్రభాస్‌తో కలిసి రాఘవేంద్ర (2003)లో నటించింది.