ఏసీబీకి చిక్కన డిప్యూటీ కమిషనర్ రవి కుమార్
హోటల్‌ను జప్తు చేయకుండా, వ్యాపార ప్రతిష్ట దెబ్బతీయకుండా చూడటానికి ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి, అందులో రెండు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ ఏసీబీకి లొంగిపోయిన ఘటన హైదరాబాద్ నగరంలో కలకలం సృష్టించింది. తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారుల ప్రకారం, జీహెచ్ఎంసీ – రాజేంద్రనగర్ పురపాలక సంఘం, డిప్యూటీ కమిషనర్ కె. రవి కుమార్ హోటల్ నిర్వాహకుడిని వేదిస్తూ, వ్యాపార ప్రతిష్ట దెబ్బతీయకుండా, భవిష్యత్తులో హోటల్ వ్యాపారం సజావుగా కొనసాగించేందుకు అవినీతి పూరితంగా ఐదు లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో హోటల్ నిర్వాహకుడు లంచం డిమాండ్ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేయగా, అధికారులు ఉచ్చు పన్నారు. డిప్యూటీ కమిషనర్ రవి కుమార్ రూ.5,00,000/- డిమాండ్ చేసినప్పటికీ, మొదటి విడతగా తీసుకుంటున్న రూ.2,00,000/- లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు అతన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.