- రోగుల పట్ల మర్యాదగా వ్యవహరించాలి
- అన్ని విభాగాలు పరిశుభ్రంగా ఉండాలి
- జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి శాఖ అధికారి తన బాధ్యతను నిబద్ధతతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ సూచించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్లోని కలెక్టర్ సమావేశ మందిరం నందు ఆసుపత్రిలోని వివిధ శాఖలకు చెందిన హెచ్వోడిలతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ దావాఖానాకు వచ్చే పేషెంట్ల విషయంలో హౌస్ కీపింగ్ సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోబడతాయని కలెక్టర్ తెలిపారు. నర్సింగ్ సూపర్డెంట్ హౌస్ కీపింగ్ సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు ఆసుపత్రిలో ఓపి రిజిస్ట్రేషన్ పిహెచ్ఐఎంఎస్ నందు చేయాలని తెలిపారు. ఆసుపత్రి హెచ్ ఓ డి లు ఓపీలను జాగ్రత్తగా గమనించాలన్నారు. వైద్య సిబ్బంది తప్పకుండా సమయపాలన పాటించాలని తెలిపారు. ఓటి షెడ్యూల్ ప్రకారం అన్ని శస్త్ర చికిత్సలు, ఎం సి హెచ్ నందు డెలివరీలు ఎక్కువ జరిగేలా చూడాలని ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కలిగే వ్యవహరించాలన్నారు. టీబి రోగులు కూడా ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసి మెరుగైన సేవలు అందిస్తున్నామని మెడికల్ ఆఫీసర్ స్టోర్స్ విభాగం నందు మందుల స్టాక్ వివరాలు, ఆసుపత్రిలోని ఔషధ కమిటీ అత్యవసర ఔషధాలు ఎప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.
పేద ప్రజలకు ఎక్కువగా డబ్బులు వైద్యం, విద్యకు ఖర్చవుతున్నావని, ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందించి వారిని ఆదుకోవాలని తెలిపారు. పీహెచ్సీ జిజిహెచ్ లకు రక్త పరీక్షల రిపోర్టులు ఆలస్యం కాకుండా విడుదల చేయాలని తెలిపారు. సిటీ స్కాన్ ఎక్స్రే విభాగం ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. సదరన్ నిర్వహణ జాగ్రత్తగా నిర్వహించాలని తెలిపారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బ్లడ్ బ్యాంకు నందు అవసరమైన అన్ని బ్లడ్ గ్రూపులు అందుబాటులో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రిలోని సీసీ కెమెరాలు అన్ని నిర్వహణలో ఉండేటట్లుగా చూడాలన్నారు. వారంలో మూడుసార్లు శాఖల హెచ్ ఓ డి లు సమావేశమై సమస్యలు గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కుమార్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జయలత, డాక్టర్ శ్రీకాంత్, అన్ని విభాగాలకు చెందిన హెచ్వోడీలు పాల్గొన్నారు.