- ప్రజల ప్రాణాలతో చెలగాటమనాడుతున్న ప్రజాపాలన ప్రభుత్వం
- గ్రామాల్లో కరెంటు తీగలు తెగిపోయినా పట్టించుకోని అధికారులు
వర్షాలతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని, దీంతోపాటు ప్రజల ప్రాణాలతో ప్రజాపాలన ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీఆర్‌ఎస్ మండల ఆర్గనైజింగ్ సెక్రటరీ లావుడ్య పూర్ణ ఆరోపించారు. గిరిజన గ్రామాల్లో వీధి స్తంభాలు వంగినా, తీగలు తెగిపోయే స్థితిలో ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేగళ్లతండాకి వెళ్లే రహదారి ఎదురుగా ఉన్న బజారులో భూక్యా వీరన్న ఇంటి వద్ద గత మూడు సంవత్సరాలు నుండితెగిపోయి ఉన్న కరెంటు తీగలను ఒక తాడు ముక్కతో ఆ తీగను లాగి కట్టి మరమ్మత్తులు చేయకుండా అదే కరెంటు తీగ ఒక స్తంభానికి కట్టారని, స్తంభానికి మధ్యలో ఉన్న కరెంటు తీగకు అల్యూమినియం కండక్టర్ మొత్త తెగిపోయి కేవలం ఒకే లీడ్‌మీద లోపలి ఉన్నటువంటి అనుపత్తిగ మీద ఆధారపడి కరెంటు సరపరా అవుతుందన్నారు. ఆలీడ్ ఎప్పుడు తెగిపోతుందో అర్థం కాక చుట్టుపక్కల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. ప్రజలు ఆందోళనలకు గురవుతున్నా సంబంధిత అధికారులకు పట్టించుకోవడం లేదని అన్నారు.
ప్రజాపాలన అంటే కనీసం వీధి స్తంభాలకు తండాల్లో ఉన్నకరెంట్ తీగలకు మరమ్మత్తులు కూడా చేయనటువంటి ప్రభుత్వాన్ని ప్రజా ప్రభుత్వమని ఏవిధంగా అంటారని ప్రశ్నించారు. గత పది సంవత్సరాల కాలంలో కెసిఆర్ పాలనలో పల్లెల్లో పట్టణాల్లో ప్రగతిని ఉరుకులు పెట్టించారని, తండాలకు గుండాలకు, గ్రామపంచాయతీలుగా చేసి గ్రామాల్లో రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లతో దర్శనమిచ్చేయని ఇప్పుడు ఉన్న ప్రభుత్వం గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం కమీషన్లకు కక్కుర్తిపడి గ్రామాలు, తండాలు, పట్టణాలు కుంటుపడే విధంగా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని కరెంట్ తీగలకు మరమ్మత్తులు చేయాలని లేకపోతే బీఆర్‌ఎస్ పార్టీ సంబంధిత అధికారుల ఆఫీసులను ముట్టడిచేసి ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.