ఉత్తమ ప్రతిభ కనపరిచిన త్రిబుల్ ఐటీ లో జి శృతి,ఎస్ గీతిక లకు స్థానం
ప్రభుత్వ పాఠశాలలో చదివి పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచి త్రిబుల్ ఐటీ లో స్థానం సంపాదించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెంచికల్ దీన్నే విద్యార్థులు జి శృతి, ఎస్ గీతిక లను అరిబండి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి ఇరువురికి నగదు ప్రోత్సాహకంగా చెరో 5000 రూపాయల నగదు పారితోషకాన్ని పెంచికల్ దిన్న మాజీ సర్పంచ్, న్యాయవాది సుంకర క్రాంతి కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పెంచికలదిన్నె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఒక ప్రత్యేక స్థానం ఉందని చదువులో ఉన్నత శిఖరాలకు వెళ్లే విద్యార్థులకు ఎల్లప్పుడూ గ్రామస్తుల సహకారం ఉంటుందని మాజీ ఎమ్మెల్యే అరిబండి లక్ష్మీనారాయణ జ్ఞాపికగా ట్రస్ట్ నుంచి సహకారం అందజేసినట్లు తెలిపారు.ఉన్నత చదువుల కోసం డబ్బు లేదని బాధతో ఎవరు ఉండవద్దని ఉన్నత శిఖరాలకు వెళ్లే విద్యార్థులకు ట్రస్ట్ తరుపున సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎల్. శ్రీనివాస అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిరికొండ అనిల్ కుమార్, జింకల భాస్కర్ , రాఘవరెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు .