తెలంగాణలో పిజి ఈసెట్, లాసెట్ అడ్మిషన్ల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 26న నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆగస్ట్ 1నుండి 9 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. 11,12 తేదీల్లో మొదటి విడత వెబ్ ఆప్షన్లు, 16న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. ఆగస్ట్ 18 నుండి 21 వరకు కాలేజీల్లో విద్యార్థులు రిపోర్ట్ చేయాల్సి వుంటుందని అన్నారు. లాసెట్ అడ్మిషన్లకు ఆగస్ట్ 4 నుండి 14 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లకు అనుమతి ఇచ్చారు. 16,17 తేదీల్లో వెబ్ ఆప్షన్లు, 22 సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. 22 నుండి 25 వరకు సెల్ఫ్ రిపోర్టింగ్‌కు అవకాశం ఉంది.