Saturday, August 2, 2025
spot_img

ఔట‌ర్ చుట్టూ రాజ్య‌మేలుతున్న రెడ్డి ఆర్డీవోలు

Must Read
  • ఖరీదైన ప్రాంతాల్లో రెడ్డి అధికారులను నియమించిన ప్రభుత్వం
  • హెచ్ఎండీఏ పరిధిలో కిలోమీటర్ల మేర వారి హవానే!
  • వెలమ ముఖ్యమంత్రి హయాంలో వెలమలదే రాజ్యాధికారం
  • రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో రెడ్డిలదే రాజ్యమేనా
  • అసలు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఏం జరుగుతోంది
  • ఖరీదైన భూములను కొల్లగొట్టడానికే అనునయులను నియమించుకున్నారా?
  • ప్రజలకు జవాబు దారితనంగా పనిచేయని ప్రభుత్వాలు
  • ప్రజల అనుమానాలను తీర్చేందుకు ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో

హైదరాబాద్‌, ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ విస్తరిస్తున్న హెచ్ఎండీఏ ప‌రిధిలో “రెడ్డిల రాజ్యం” నడుస్తోంది.. రెవెన్యూ కార్యాలయాల నుంచీ ఇతర శాఖల వరకు అధికారం ఒకే వర్గానికి కేంద్రీకృతం అవుతుండటం, పనులు చేయించుకోవాలంటే లంచాలు తప్పవనే అప‌వాద‌న‌ల‌ను కాంగ్రెస్ ప్ర‌భుత్వం మూట‌క‌ట్టుకుంటుంది. పాత ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో “ఎక్కడ చూసినా వెలమ అధికారుల హవా” నడిచినట్లే, ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారుల ఆధిపత్యం కొనసాగుతుందని విమర్శ‌లు వెల్లువెత్తున్నాయి. పని చేయించుకోవడంలో వర్గపరమైన అభిమతం, లంచాలకే పని చేసే వ్యవస్థ వల్ల ప్రజలు అనేక స‌మ‌స్య‌లు ఎదుర్కుంటున్నారు. ఈ సమస్యలు తక్షణమే పరిష్కారమయ్యే పరిస్థితి కనిపించకపోవడం, సామాజిక న్యాయం శూన్యంగా మిగిలిపోవడం పట్ల హైద‌రాబాద్, హెచ్ఎండీఏ ప‌రిస‌ర ప్రాంత ప్ర‌జ‌లు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు..

హైదరాబాద్ చుట్టుముట్టు కొన్ని ఖరీదైన ప్రాంతాల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పనిచేస్తున్న అధికారుల తీరు చూస్తుంటే భయమేస్తుందని ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏమి చేయాలన్న లంచాలు మాత్రం ఇవ్వాల్సిందేనని కొంతమంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు, హెచ్ఎండీఏ పరిధి చుట్టూ ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్న చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలన్న అధికారుల పెత్తనంతో నలిగిపోతున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నప్పటికీని అధికారుల ఆగడాలు మాత్రం ఆగ‌డం లేదు.

ఇదిలా ఉంటే హైదరాబాద్ నగరానికి ఉన్న ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఉన్న చాలా రెవెన్యూ డివిజన్లో అధికారులు మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారేనని మేధావులు, సామాజికవేత్తలు సోషల్ మీడియా ద్వారా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఉదాహరణ కుఇబ్రహీంపట్నం ఆర్డీవో గా అనంత రెడ్డి, కందుకూర్ ఆర్డీవో గా జగదీశ్వర్ రెడ్డి, రాజేంద్రనగర్ వెంక‌ట్ రెడ్డి, శేర్లింగంపల్లి వెంకా రెడ్డి, యాదాద్రి భువనగిరి కృష్టా రెడ్డి, చేవెళ్ల చంద్ర‌క‌ళా రెడ్డి, కీస‌ర ఉపేందర్ రెడ్డి, చౌటుప్ప‌ల్ శేఖ‌ర్ రెడ్డి ఇలా ఔట‌ర్ చుట్టూ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులే ఉండడం చూస్తుంటే ఎన్నో అనుమానాలు వస్తున్నాయ‌ని ఆయా ప్రాంతాల ప్రజలు బ‌హిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. మరి ఇదంతా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి తెలిసే జరుగుతుందా లేదా ఎవరైనా మిస్ గైడ్ చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఏదేమైనా ముఖ్యమంత్రి ప్రజల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

ఇప్పుడున్న ప్రభుత్వంలో కొంతమంది రెడ్డి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎవరైనా ఉండొచ్చు వారి వ్యాపారాలు చక్క పెట్టుకోవడానికి ముఖ్యమంత్రికి తెలియ‌కుండా మేనేజ్ చేస్తున్నట్టు కూడా అనుమానాలు కలుగుతున్నాయి. నేడు రియల్ ఎస్టేట్ రంగమే కాకుండా అన్ని రంగాలు కూడా కుంటుపడుతున్నాయని.. అవి బలపడాలంటే ప్రభుత్వం, అధికారులు ప్రజల కోసం పనిచేస్తే.. అలాంటప్పుడే ప్రభుత్వం మీద న‌మ్మ‌కం ఉంటుంద‌ని ప్ర‌జ‌లు విశ్వ‌సిస్తారు.

మరి ఇది ఇలా ఉంటే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూత ఉన్న ఖరీదైన ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అధికారులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, మేడ్చల్ మల్కాజ్గిరి, కీసర, ఇబ్రహీంపట్నం, కందుకూర్, చేవెళ్ల డివిజన్ల పరిధిలో ఉన్న ఖరీదైన భూములు కొల్లగొట్టడానికి ప్రభుత్వంలో ఉన్న కొంతమంది నాయ‌కులు వారికి అనుకూలమైన అధికారులను నియ‌మించుకున్నార‌నే అప‌వాద కూడా ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రాంతాలపై దృష్టి సారించి ఇతర వర్గాలకు చెందిన అధికారుల నియమిస్తే బాగుంటుందని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. మరి గ్రేటర్ పరిధిలోని రెవెన్యూ డివిజన్లు కావచ్చు మండల రెవెన్యూ కార్యాలయం కావచ్చు బలహీనవర్గాల ప్రజలకు పనులు కాక కార్యాలయాల చుట్టూ తిరగలేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికి చెక్ పెట్టాలంటే బలహీన వర్గాలకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అధికారులను నియమించాలని ప్ర‌జ‌లు సూచిస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ ఉన్న ప్రాంతాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి సాధించి బిసి ఎస్సీ, ఎస్టి వర్గాలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు.

తెలంగాణలో బీసీ వాదం తిరుగులేనిదిగా మారుతున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ఔటర్‌ రింగ్‌ రోడ్‌ పరిధిలోని 9 ఆర్డీవో డివిజన్‌లకు చేసిన నియామకాలలో 8 మందిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అధికారులను ఎంపిక చేయడంపై పలువురు బీసీ, ఎస్సీ, ఎస్టీ నేతలు, ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ సర్కార్‌ నిజంగా బీసీల బంగారు భవిష్యత్తును నిర్మించాలని భావిస్తే, ఆ నిర్మాణానికి పునాదులు సామాజిక సమానత్వంతోనే వేయాలి. అన్ని వర్గాలకు సమానంగా అవకాశం ఇవ్వాలి. లేదంటే, బీసీ వాదం, సామాజిక న్యాయం అన్నదీ ఓ రాజకీయ ఆటగా ప్రజలు భావించక తప్పదు.

ముఖ్యమంత్రి స్వయంగా పలు సభల్లో అన్ని వర్గాల సమన్వయంతో పరిపాలన కొనసాగిస్తామని, బీసీలకు రాజకీయ, పరిపాలనాధికారం కల్పిస్తామని చెప్పిన మాటలు ఇప్పుడు ప్రజల మధ్య ఉట్టి మాట‌లుగానే వినిపిస్తున్నాయి. బీసీ వాదం నినాదాలకే పరిమితమైతే, అది వెనుకబడిన వర్గాల విశ్వాసాన్ని పాడు చేస్తుంది. నేడు బీసీ హక్కుల కోసం పోరాడుతున్నవారికి నిజమైన మద్దతు ఇవ్వాలంటే, ముఖ్యమైన పరిపాలనా హోదాలలో వారికి స్థానం క‌ల్పించాలి..

Latest News

గౌహతిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి స్థలం

అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మకు టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు వినతి ఈశాన్య భారత ప్రజలకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని మరింత...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS