- పెరుగుతున్న కీళ్లు ఎముకల బాధితులు..
- ఆరోగ్యకరమైన దేహనికి పునాది ఎముకలు..
- నేడు జాతీయ ఎముకలు, కీళ్ల దినోత్సవం..
ఈ సృష్టిలో ప్రతి జీవి కదలికకు ఎముకలు.. కీళ్లు ఎంతో ముఖ్యం ఒక చోట నుంచి మరో చోటుకు సంచించాలంటే ఇవి ఎంతో ప్రధానం. అందులో మనిషి లాంటి జీవికి మరింత ముఖ్యం. జీవనశైలి కారణంగా ప్రస్తుతంమనిషి ఎముకలు కీళ్లకు జబ్బు చేసింది. అధిక శాతం ఉన్న చోటనుంచి కదలకుండా డబ్బు సంపాదిస్తు ఇదే సమయంలోరోగాలు కొని తెచ్చుకుంటున్నారు. కదలకుండా పనులు చేయడం వల్ల ఎముకలు కీళ్లలో శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా ఎముకలు కీళ్లు వ్యాధులున్న వారి సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతోంది. ఈవ్యాధులపై అవగాహాన తీసుకుని రావడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 4వ, తేదిన జాతీయ ఎముకలు, కీళ్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్యులు రోగులకు అందిస్తున్న సూచనలు సలహాలపై ఆదాబ్ పాఠకులకు అందిస్తున్న పరిశీలనాత్మక ప్రత్యేక కథనం..
ఆర్థోపేడిక్ డాక్టర్ల భాగస్వామంతో..
భారతదేశంలో నేటి తరానికి ఎక్కువగా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యలలో ఎముకలు మరియు కీళ్ల సమస్యలు ఆగ్రస్థానంలో ఉన్నాయి. వృద్దులు, యువత. ఇంజనీర్లు, రైతులు, గృహాణిలు, వయస్సుతో సంబంధం లేకుండా ఈవ్యాధులు ఎక్కువయ్యాయి. ప్రతి సంవత్సరం జాతీయ ఎముకలు మరియు కీళ్ల దినోత్సవం జరుపుకుంటారు. ఈ దినోత్సవం మన శరీర నిర్మాణానికి ముఖ్యమైన ఎముకలు కీళ్ల ఆరోగ్యంపై సామాజికంగా చైతన్యం కల్గించేందుకు ఒక చక్కటి వేదికగా ఇండియన్ ఆర్ధోపెడిక్ ఆసోషియోషన్ ఆధ్వరంలో ఆగస్టు 4వ, 2012నాడు ఆర్ధోపెడిక్ వైద్యుల భాగస్వామ్యంతో డాక్టర్ ఎస్.రాజశేఖరన్ ‘‘స్ట్రాంగర్ బోన్స్ స్ట్రాంగర్స్ ఇండియా’’ పేరిటా (బలమైన ఎముకలు బలమైన భారత్) అనే నినాదంతో దీనిని ప్రారంభించారు. దీనియొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలకు ఎముకల కీళ్ల వ్యాధుల పట్ల అవగాహాన కల్పించడమే.
పెరుగుతున్న బాధితులు..
మన రాష్ట్రంతోపాటు హైదరబాద్ నగరంలో కూడా మోకాలి నొప్పులు, ఆస్తియో ఆర్థరైటిస్, కీళ్ల వాతం (రుమాటాయిట్ ఆర్థరైటీస్ ) బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మన భాగ్యనగరం జనాభాలో 2నుంచి 4శాతం ప్రజలు ఇలాంటి సమస్యతో బాదపడుతున్నారని వైద్యుల అంచన. మొదట్లో నగరాలు, పట్టణాల్లో మాత్రమే ఈ రోగులు అధికంగా ఉండేవారు. ఇప్పుడు శివారు ప్రాంతాలు, జిల్లాలు, పల్లెల్లో కూడాపెరుగుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రితోపాటు ప్రైవేటు దవాఖానల్లో బ్లడ్‌ప్రేషర్, చక్కెర వ్యాధి, తరువాత కీళ్ల నొప్పులు కాల్షియం మాత్రమే అధికంగావాడుతున్నట్లు అంచనా..
శారీరక శ్రమ తగ్గిపోవడం..
శారీరక శ్రమ తగ్గిపోవడం పోషకహారం లోపించడం. జంక్‌పుడ్ ఫాస్ట్‌పుడ్ తినడం అలవాటు, వంటి కారణాలలో కీళ్ల నొప్పులతో బాధపడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ఒకప్పుడు 60 ఏళ్ల దాటిన వారిలో కీళ్ల సమస్య ఏర్పడేది. నేడు పాతికేళ్ల వయస్సు నుంచే మోకాళ్ల కీళ్ల నొప్పులతో బాధపడే వారి సంఖ్య పెరిగింది. అయితే అధిక శాతం మంది నేరుగా మందుల దుకాణాలకు వెళ్లి నొప్పుల మాత్రలు కొని వాడుతున్నారు. దీర్ఘాకాలం ఈ గోలీలు వాడటం వల్ల ఎక్కువ శాతం మూత్ర పిండం వ్యాధులతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో కీళ్ల నొప్పులు తగ్గిస్తామని కీళ్లలో గుజ్జు పెంచే మందులు ఇస్తామంటు నకిలీ ఆయుర్వేద మందుల గాళ్లు ఉళ్లలో తిరుగుతు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల కాలంలో కొంత మంది వైద్యులు కాళ్ల నొప్పులు, కీళ్ల వ్యాధుల నివారణపై ప్రయోగాలు చేస్తున్నారు. అన్ని ప్రయోగాలు చేసి చివరకు కీళ్ల మార్పిడి చేయించుకుంటున్నారు.
ఆస్థియో ఆర్థరైటీస్..
కీళ్ల బలహీనపడటం ఆరుగుదల కారణంగా ఆస్థియో ఆర్థరైటీస్ మోకాలు నొప్పి, వస్తుంది. కీళ్లలో ఉండే కార్టిలేజ్ అనే మృదువైన కుషన్‌లాంటి పదార్థం దెబ్బతినటం, వల్ల కీళ్ల మధ్యలో ఉండే ఖాళీ స్థలం తగ్గి ఎముకలు ఒకదానితో ఒకటి రాసుకుంటాయి. ఈ క్రమంలో మోకాలులో నొప్పి బిగుసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 40 ఏళ్ల పై బడిన వారిలో ఈ సమస్య అధికంగా కనిపిస్తోంది. మరి కొందరిలో వంశపారం పర్యంగా మరికొందరిలో ఎక్కువ బరువులు మోసేవారిలో ఈ సమస్య వస్తుంది.
రుమాటాయిడ్ ఆర్థరైటీస్….!!
ఇది దీర్ఘాకాలిక వ్యాధి మన శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ వ్యతిరేక దిశల పనిచేయడం వల్ల ఇది సంభవిస్తుంది. దీనివల్ల కీళ్లలో నొప్పి వాపు బిగువును కలుగజేస్తుంది. ఒకేసమయంలో శరీరం రెండు వైపులా సమంగా కీళ్లనొప్పి కలుగుతుంది. కొన్ని వారాల్లో ఇది వృద్ధి చెందవచ్చు. మీ కీళ్లను నాశనం చేయడం ప్రారంభిస్తుంది. ఇది సాదారణంగా చెయ్యి పాదం మణికట్టు, మోచేయి, చీలమండలంలోని చిన్న కీళ్లను ప్రభావితం చేస్తుంది. దీనికి స్త్రీ పురుష అన్న బేదం లేదు. అయితే పురుషులతో పోలిస్తే స్త్రీలలో ఈ వ్యాధి అధికంగా కనిపిస్తోంది. చికిత్స చేయకపోతే శాశ్వతంగా కీళ్లకు హాని కలుగజేస్తుంది.
సమస్య ఉన్నవారు ఇలా చేయాలి..
వయస్సు మీద పడిన వారు ఎక్కువగా సమతులా హారాన్ని తీసుకోవాలి. ఎముక ఆరోగ్యానికి కావాల్సిన కాల్షియం, ప్రోటీన్లు కల్గిన ఆహారాన్ని తీసుకోవాలి. డాక్టర్ల సూచన మేరకు నిర్ణీత కాలంపాటు కాల్షియం విటమిన్ డీ మాత్రలు వాడాలి. బిపి షూగర్ అధిక బరువు ఉండే వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. ఇందుకోసం నియమిత ఆహారం మందులు తీసుకోవాలి. కండరాలు ఎముకలను బలోపేతం చేసుకోవాడానికి రోజు క్రమ తప్పని సరిగా వ్యాయం చేయాలి. ధూమ, మధ్యపానానికి దూరంగా ఉండాలి.

అధిక మాత్రలతో కిడ్ని సమస్యలు..
డాక్టర్ బి.విక్రంకుమార్. నేఫ్రాలాజి. ప్రోఫెసర్ ప్రభుత్వ ఆసుపత్రి, సంగారెడ్డి..
కీళ్ల నొప్పులతో బాధపడే వారు ఎక్కువగా నొప్పుల మాత్రలు అధికంగా వాడకూడదు. దీని వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఒక్కసారి కిడ్నిలు దెబ్బతింటే వాటిని బాగు చేసుకోవడం చాల కష్టం. వైద్యుల సూచన మేరకు మందులు వాడాలి. కీళ్ల నొప్పులు తగ్గించుకునేందుకు అవసరమైన వ్యాయామం ఫీజియోథేరపి చేయించుకోవాలి. ఎక్కువ సేపు ఎయిర్‌కండిషనర్ గదుల్లో కూర్చోకూడదు. అధిక బరువు వల్ల కూడా కీళ్లలో కార్టిలేజ్ గుజ్జు కరిగిపోయి ఎముకలు మెత్త బడతాయి.

రోజు వ్యాయామం అవసరం.. డాక్టర్.సతీష్ పారుపల్లి, ఆర్ధోపెడిక్. ప్రోఫెసర్ హెచ్.వో.డి ప్రభుత్వ వైద్యకళశాల సూర్యపేట్..
నేటి రోజుల్లో చిన్న వయస్సులోనే కీళ్ల వ్యాధులు ఎముకల వ్యాధులు వస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు చేసే వారు ఎక్కువ సేపు ఒకే చోటా కూర్చుని పనిచేయడం. ఉదయం పూట, సాయంత్రం పూట వ్యాయమాలు చేయకపోవడం. వల్ల ఎముకలు త్వరగా మొత్త బడుతున్నాయి. మారుతున్న జీవనశైలి కారణంగా 35 ఏళ్ల దాటిన వారిలో త్వరగా మోకాళ్ల నొప్పులు వస్తున్నాయి. ఇలాంటి వారు డాక్టర్ల సలహా సూచనలు మేరకు మందులు వాడుతూ వ్యాయమం చేస్తు ఉండాలి. అవసరమైతే ఫీజియోథేరపి చేయించుకోవాలని సూచిస్తున్నారు.