Saturday, August 9, 2025
spot_img

బోడుప్పల్ మున్సిపల్ ను… అమ్మేస్తారా..?

Must Read
  • అనుమతులు లేకుండా అక్ర‌మ‌నిర్మాణాలు
  • యథేచ్ఛగా గృహ, కమర్షియల్ షెడ్లు, సెల్లార్ల కట్ట‌డాలు
  • ప్రభుత్వ ఆదాయానికి గండీకొడ‌తున్న అధికారులు
  • ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజ‌ర్‌
  • క‌మీషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీఎస్‌, చైన్ మెన్ల దోపిడీ
  • పథకం ప్రకారం అక్రమ నిర్మాణదారునికి స‌హ‌క‌రిస్తున్న టౌన్‌ప్లానింగ్ సిబ్బంది
  • చైన్‌మెన్ల‌ అక్రమ సంపాదనే రూ.5 లక్షలకు పైగా అంటూ విమర్శలు

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో టీపీఎస్, వారి అనుచరులైన చైన్ మెన్లు ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా చేపడుతున్నప్పటికీ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది ఏమి పట్టనట్టు అక్రమ నిర్మాణాలను ప్రోత్సాహిస్తూ, అందినకాడికి దోచుకుంటూ పరోక్షంగా మున్సిపల్ ఆదాయానికి గండికొడుతూ కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చిపెడుతున్నారు.. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు జరగడం ఇక్కడ సర్వ సాధారణ విషయంగా మారిపోయింది. వీటిపై స్థానికులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ వారు ఏమి పట్టనట్టు వ్యవహరించడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్ళితే…

బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్‌లో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజ‌ర్‌గా పనిచేస్తున్న కావ్య వారంలో నాలుగు రోజులు మాత్రమే విధులకు హాజరవుతాని తెలుస్తోంది. టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజ‌ర్‌గా పనిచేస్తున్న కావ్యకు తోడుగా మరో ముగ్గురు చైన్ మెన్లు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కీలకమని అంతా చెప్పుకుంటున్నారు. వీరు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా వ్యవహారాలు నడుస్తున్నాయని అంతా అనుకుంటున్నారు. కార్పొరేషన్ లో ఏ డివిజన్ లోనైనా అక్రమ నిర్మాణం జరిగినా… వీరిని ఏ అధికారి పిలిచి మందలించక పోవడంతో అక్రమ సంపాదనకు తెరలేపారు. బోడుప్పల్ మున్సిపల్ లో ఎక్కడ అక్రమ కట్టడాలు జరిగినా.. ముందుగా తెలిసేది (చైన్ మెన్) ఒక్క తాత్కాలిక సిబ్బందికి మాత్రమే.. వీరు చిన్న చిన్న అక్రమ ఆకట్టడాల విషయాలను తామే సొమ్ము చేసుకుంటూ భారీ కట్టడాల ప్రస్తావనను టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజ‌ర్ దృష్టికి తీసుకెళ్తున్నారట. ఈ తాత్కాలిక సిబ్బంది ఒక్కో నిర్మాణానికి ఒక్కో రేటు నిర్ణయించి అధికారులకు నిర్మాణదారునికి మ‌ధ్య‌వ‌ర్తిగా వ్య‌వ‌హ‌రిస్తూ, దగ్గరుండి అన్నీ వ్య‌వ‌హారాలు చక్కబెడుతున్న‌ట్లు తెలుస్తుంది.

తాత్కాలిక సిబ్బంది సంపాదనే రూ. 5 లక్షలు..?
మున్సిపల్ పరిధిలో వందల సంఖ్యలో పుట్టగొడుగుల్లా అనుమతులు లేకుండా కమర్షియల్ షెడ్లు, బహుళ అంతస్తుల నిర్మాణాలు పుట్టుకొస్తున్న బాధ్యత కలిగిన సంబంధిత మున్సిపల్ అధికారులకు మాత్రం కనీసం చీమ కుట్టినట్లయినా ఉండటంలేదు. ఆవు చేనులో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నచందంగా తయారయ్యింది. టౌన్ ప్లానింగ్ సిబ్బంది అక్రమాలను సక్రమమం చేస్తూ మూడు పువ్వులు ఆరుకాయలుగా వ్యవహారాలు చక్కబెడుతున్నారు. దీంతో లక్షల్లో మున్సిపల్ ఆదాయానికి గండిపడుతుందని పలువురు నిబద్ధతతో కూడిన అధికారులు చెబుతున్నారు.

కమీషనర్ పర్యవేక్షణ లేకపోవడంతో టీపీఎస్, చైన్ మెన్లదే హవా
మున్సిపల్ లోని ఏ వార్డు కెళ్ళినా.. ఏ గల్లీ కెళ్ళినా అక్రమ నిర్మాణాలు, సెట్ బ్యాక్ లేకపోయినా అధికారులు ఇచ్చిన అనుమతులు, అవినీతి అధికారుల బాగోతాలు, అనుమతి లేకుండా పై అంతస్తులు నిర్మించిన‌, నిర్మిస్తున్న భ‌వ‌నాలు దర్శనమిస్తుంటాయి. వీటిలో మొదటగా తాత్కాలిక సిబ్బంది చైన్ మెన్లు మొదటగా వసూళ్లకు దిగుతారు. భవన నిర్మాణ యజమానితో బేరం మాట్లాడుతారు. వారు ఇవ్వలేదో ఇక ఆ ఇంటి యజమానికి చుక్కలు చూపిస్తారు. ఈ వ్యవహారం అటు మున్సిప‌ల్‌ కమీషనర్ కు కానీ ఇటు అధికారులకు తెలియనియనివ్వకుండా తాత్కాలిక సిబ్బంది ఎంతో జాగ్రత్త పడుతున్నారు. ఈ మధ్యనే ఇద్దరు చైన్ మెన్ లు (తాత్కాలిక సిబ్బంది) ఒకరి ప్లాట్ లో మరొకరు అక్రమ నిర్మాణం చేస్తుంటే, అక్రదారునికి సహకరించారని ప్లాట్ యజమాని మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది. వ్యవహారంఫై స్థానికంగా పెద్దే చర్చే నడిచింది. ఇకనైన ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ బోడుప్పల్ లో జరిగిన, జరుగుతున్న అవినీతి అక్రమాలపై దృష్టి సారించి అవినీతి అధికారుల భరతం పట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Latest News

ఇందూ ప్రాజెక్టుల పేరిట మరో మోసం

వివాదాల సుడిగుండంలో 'ఇందూ' ప్రాజెక్టులు న‌యా దందాకు తెర‌లేపిన ట్రినిటీ లివింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌ బుకింగ్‌ల పేరుతో ల‌క్ష‌ల్లో వ‌సూళ్లు.. త్వ‌ర‌లో రిజిస్ట్రేష‌న్స్ అంటూ బుకాయింపు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS