Friday, August 15, 2025
spot_img

ఆసీస్‌పై సౌతాఫ్రికా ఘన విజయం!

Must Read

ఆస్ట్రేలియా పర్యటనలో ఎట్టకేలకు సౌతాఫ్రికా తొలి విజయాన్నందుకుంది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓడిన సఫారీ టీమ్‌.. ఆ పరాజయం నుంచి త్వరగానే తేరుకుంది. మంగళవారం ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో 53 పరుగుల తేడాతో గెలుపొందింది. జూనియర్‌ ఏబీడీ, డెవాల్డ్‌ బ్రెవిస్‌ విధ్వంసకర శతకంతో సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ గెలుపుతో మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమంగా నిలిచింది. సిరీస్‌ డిసైడర్‌ అయిన మూడో టీ20 శనివారం జరగనుంది.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 218 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (56 బంతుల్లో 12 ఫోర్లు, 8 సిక్సర్లతో 125 నాటౌట్‌) అజేయ శతకంతో చెలరేగాడు. అతనికి తోడుగా ట్రిస్టన్‌ స్టబ్స్‌(22 బంతుల్లో 3 ఫోర్లతో 31) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలరర్లలో గ్లేన్‌ మ్యాక్స్‌వెల్‌(2/44), బెన్‌ ద్వార్షుయిస్‌(2/24) రెండేసి వికెట్లు తీయగా.. జోష్‌ హజెల్‌ వుడ్‌, ఆడమ్‌ జంపా చెరో వికెట్‌ పడగొట్టారు. అనంతరం ఆస్ట్రేలియా 17.4 ఓవర్లలో 165 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. మరోసారి టీమ్‌ డెవిడ్‌(24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్‌ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌(13 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 22), అలెక్స్‌ క్యారీ(18 బంతుల్లో 3 ఫోర్లతో 26) చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో క్వెనా మఫకా(3/57), కోర్బిన్‌ బోచ్‌(3/20) మూడేసి వికెట్లు తీయగా.. మార్క్‌రమ్‌, పీటర్‌ రబడా తలో వికెట్‌ తీసారు.

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS