Thursday, August 14, 2025
spot_img

వాహన రాకపోకలకు తాత్కాలిక ఆంక్షలు

Must Read

భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రేపు (ఆగస్టు 15) ఉదయం 10 గంటలకు గోల్కొండ కోట ప్రాంగణంలో ప్రధాన వేడుకలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా పోలీసులు భద్రతా చర్యలతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాందేవ్‌గూడ నుంచి గోల్కొండ కోట దారి సాధారణ వాహనాలకు పూర్తిగా మూసివేయబడుతుంది. ఈ సమయంలో ప్రయాణికులు ముందుగానే ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ పరిసరాల్లో కూడా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు అమలులో ఉంటాయి.

మళ్లింపులు:

  • సెవెన్ టూంబ్స్ దిశ నుంచి వచ్చే వాహనాలు జమాలి దర్వాజా వైపు మళ్లించబడతాయి.
  • GHMC గ్రౌండ్, GHMC ఐల్యాండ్ ప్రాంతాల నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మోతీ మహల్ ఎక్స్ రోడ్ వైపు పంపిస్తారు.
  • బడా బజార్ నుంచి వచ్చే వాహనాలను GHMC ఐల్యాండ్ వైపు మళ్లిస్తారు.
  • నార్సింగి, టిప్పు ఖాన్ వంతెనల వైపు నుంచి వచ్చే ట్రాఫిక్ రాందేవ్‌గూడ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది.

పార్కింగ్ ఏర్పాట్లు:

  • వీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలకు బాలా హిస్సార్ – బడా బజార్ మసీదు మధ్య ప్రత్యేక పార్కింగ్.
  • ప్రభుత్వ సీనియర్ అధికారులకు గోల్కొండ బస్ స్టాప్ వద్ద.
  • ఇతర ప్రముఖులకు ఫుట్‌బాల్ గ్రౌండ్ వద్ద.
  • మీడియా ప్రతినిధులు, అవార్డు గ్రహీతలు ఏరియా హాస్పిటల్‌లో.

సాధారణ ప్రజలకు సెవెన్ టూంబ్స్, డెక్కన్ పార్క్, హుడా పార్క్ ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యం.

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS