భారత్-పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన సైనిక ఉద్రిక్తతలపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాలు అణుయుద్ధం దశకు చేరుకున్న సమయంలో తానే జోక్యం చేసుకుని యుద్ధాన్ని ఆపానని ఆయన ప్రకటించారు.
పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ సంబంధాలు తీవ్రంగా దిగజారాయని, ఓ దశలో ఇరు దేశాలు అణ్వాయుధ దాడులకు సిద్ధమయ్యాయని ట్రంప్ వెల్లడించారు. ఆ పరిస్థితిలో తాను మధ్యవర్తిత్వం చేస్తూ, యుద్ధాన్ని వెంటనే ఆపకపోతే అమెరికా రెండు దేశాలతో ఎలాంటి వ్యాపార సంబంధాలు కొనసాగించదు అని స్పష్టంగా హెచ్చరించానని వివరించారు. కాల్పుల విరమణ విషయంలో భారత్ ఎన్నోసార్లు విదేశీ జోక్యం లేదని ప్రకటించినప్పటికీ, ట్రంప్ మాత్రం తన పాత్రను పదేపదే ప్రస్తావిస్తున్నారు. తన బెదిరింపుల తరువాతే ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని ఆయన అన్నారు.
తాను కేవలం భారత్-పాక్ యుద్ధాన్ని మాత్రమే కాకుండా, అంతర్జాతీయంగా పలు సంక్షోభాలను కూడా నివారించానని ట్రంప్ పేర్కొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో వైట్ హౌస్‌లో భేటీ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.