లయన్స్ క్లబ్ 320H గవర్నర్ శ్రీ గంప నాగేశ్వరరావు గారు మరియు సీనియర్ లయన్ సభ్యుల చేత, లయన్స్ క్లబ్ హైదరాబాదు ప్రైడ్ స్టార్స్ అధ్యక్షులు డా. లయన్ సహయ రఘు గారికి ప్రతిష్టాత్మక MJF మెడల్ ను అందజేశారు. ఈ ఘనత లయన్స్ భవన్‌లో జరిగిన కేబినెట్ మీట్ సందర్భంగా జరిగింది.
సమాజ సేవా కార్యక్రమాలలో ఆయన చేస్తున్న విశేష కృషి, వృద్ధుల సంక్షేమం కోసం చేస్తున్న అహర్నిశ కృషిని గుర్తించి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.
