- పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి
- గాంధీ కుటుంబం దేశానికి వరం
గత ప్రభుత్వాలు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కోటను మైనింగ్ లీజుకు ఇచ్చి, చారిత్రక వారసత్వాన్ని కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేశాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. ట్యాంక్‌బండ్ వద్ద పాపన్నగౌడ్ విగ్రహ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మాట్లాడారు. పాపన్నగౌడ్ బహుజన సామ్రాజ్యాన్ని నిర్మించి, అందరికీ ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. చరిత్ర కలిగిన కోటలను కాపాడి, వాటిని చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.
ఈ సందర్భంగా గాంధీ కుటుంబం దేశానికి అందించిన సేవలను ఆయన గుర్తు చేశారు. “మహాత్మా గాంధీ శాంతితో యుద్ధాన్ని గెలవొచ్చని నిరూపించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. సోనియా గాంధీ పదవిని త్యజించి దేశ ప్రయోజనాన్ని ముందుకు నడిపారు” అని అన్నారు. రాహుల్ గాంధీ ఇచ్చిన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీను ప్రస్తావిస్తూ, “గాంధీ కుటుంబం ఇచ్చిన మాట శిలాశాసనం” అని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో తొలిసారిగా కులగణన సర్వే నిర్వహించామని, అందులో ఏవైనా తప్పులు ఉంటే శాసనసభ వేదికగా చూపించాలని అన్ని రాజకీయ పార్టీలను సవాల్ విసిరినట్లు గుర్తు చేశారు. “తప్పులు ఉంటే క్షమాపణ చెప్పేందుకు నేను సిద్ధం” అని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం కులగణనను విమర్శించవద్దని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల పెంపును కేంద్రం ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉంచిందని విమర్శించిన ఆయన, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలను కలిపితే రిజర్వేషన్లు 70 శాతానికి చేరుతాయని వివరించారు. కానీ గత ప్రభుత్వం 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వకుండా చట్టం చేసి, అదే ఇప్పుడు అడ్డంకిగా మారిందని ఆరోపించారు.
గాంధీ కుటుంబం దేశానికి వరం
గాంధీ కుటుంబం దేశానికి గొప్ప వరమని, వారి నాయకత్వం వల్లే భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. “శాంతితో యుద్ధాన్ని గెలవవచ్చని మహాత్మా గాంధీ నిరూపించారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. దేశ ప్రయోజనాల కోసం సోనియాగాంధీ పదవులను త్యజించారు. భారతదేశం మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఆ కుటుంబం గొప్ప నాయకత్వాన్ని అందించింది. ప్రపంచం భారత్ను గుర్తించినట్లే, గాంధీ కుటుంబాన్నీ గుర్తిస్తోంది” అని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతూ, “బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ మాట ఇచ్చారు. గాంధీ కుటుంబం ఇచ్చిన మాట శిలాశాసనం. దేశంలో ఎక్కడా జరగని విధంగా తెలంగాణలో కులగణన సర్వే చేశాం. అందులో తప్పులుంటే చూపాలని శాసనసభ వేదికగా అన్ని రాజకీయ పార్టీలను సవాల్ విసిరాం. తప్పులు ఉంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధమే” అని స్పష్టం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం కులగణనను విమర్శించవద్దని హెచ్చరించిన రేవంత్ రెడ్డి, దీన్ని తప్పుపడితే వందేళ్లపాటు బహుజనులకు న్యాయం జరగదని హెచ్చరించారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును కేంద్రం ఐదు నెలలుగా పెండింగ్‌లో పెట్టిందని విమర్శించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కలిపి రిజర్వేషన్లు 70 శాతం వరకు అవసరమని ఆయన పేర్కొన్నారు. అయితే, గత ప్రభుత్వం 50 శాతం మించి రిజర్వేషన్లు ఇవ్వకుండా చట్టం చేసి, అదే ఇప్పుడు అడ్డంకిగా మారిందని ఆయన ఆరోపించారు.