- అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు….!!
- నగర ప్రజలకు మెరుగైన సేవలు అందిచటమే లక్ష్యం..
- కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్
నగర ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడంతో భాగంగా ట్రాఫిక్ విభాగాన్ని ఆధూనికరించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్ ఐపీఎస్, నూతన ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ట్రాఫిక్ వ్యవస్థ మరింత సమర్థవంతంగా తీర్చదిద్దందుకు విభిన్న మార్గదర్శకాలను చేపడుతున్నారు.హైదరబాద్ నగరంలో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహానాలు విపరితంగా పెరిగిపోవడం, వీటికి తోడు అన్నట్లు వాణిజ్య వాహానాల విస్తరణ వల్ల ట్రాఫిక్ నియంత్రణ సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ విభాగానికి ఆధూనిక సాంకేతికతో కూడిన పరికరాలు, సాఫ్ట్‌వేర్ వ్యవస్థల మొబైల్ యాప్స్, బాడికెమెరాలు, ప్రథమ చికిత్స, వంటి హాంగులతో పాటు ట్రాఫిక్ సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రధాన మార్గల్లో సిగ్నల్ సమన్వయం ట్రాఫిక్ సరళీని రియల్‌టైం మానిటరింగ్ నంబర్ ప్లేట్ గుర్తింపు, వంటి ఆధూనిక సాంకేతికతను వినియోగించి ట్రాఫిక్‌ను సక్రమంగా నియంత్రించేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. నగర ట్రాఫిక్ విభాగంలో ఆధూనిక టేక్నాలజీ వినియోగం ఆధాబ్ ప్రత్యేక కథనం..
ట్రాఫిక్ పోలీస్ మెడర్నైజేషన్..
హైదరబాద్ వంటి మెట్రో నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించడం పెద్దసవాలుతో కూడిన విషయం. దీనికి తోడు నగరంలో వేగంగా పెరుగుతున్న వాహనాల రాకపోకలు సాంకేతికంగా పరిష్కారం అవసరం ఉందని ట్రాఫిక్ పోలీస్ విభాగం మోడర్‌నైజేషన్ వైపు అడుగులు వేస్తోంది. ఏదైన ఉహించని పరిస్థితిలో ఎలా స్పందించాలి, ట్రాఫిక్ మెనెజ్‌మెంట్ టూల్స్‌ను ఎలా ఉపయోగించాలి అన్న విషయాల్లో ట్రాఫిక్ సిబ్బందికి ఇప్పటికే ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లును ఆధునిక సదుపాయలతో అభివృద్ధి చేస్తున్నారు.
అభివృద్ధికి ఆధునిక సాంకేతిక మద్దతు..
ట్రాఫిక్ పోలీస్ విభాగాన్ని మోడర్‌నైజేషన్ చేసేందుకు పలు ఆధునిక పరికరాలు సాంకేతికవ్యవస్థలను ప్రవేషపెట్టారు. ఎలక్ట్రానిక్ వ్యవస్థల వంటి పరికరాల వినియోగంతో ట్రాఫిక్ పోలీసుల పనితీరులో వేగం సమర్థత పారదర్శకత పెరుగుతుంది.

బాడివెర్న్ కెమెరా: పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతిచర్యను రికార్డు చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఇదీ ట్రాఫిక్ పోలీస్ వ్యవస్థలో పారదర్శకత పెంచుతుంది.
డ్యాష్‌బోర్డు కెమెరా: ట్రాఫిక్ వాహానాల్లో ఏర్పాటు చేసిన ఈ కెమోరాలు రోడ్డుపై జరిగే ప్రతి సంఘటనను రికార్డుచేస్తోంది.
కాలర్ మైక్రోఫోన్: మొబైల్ మైక్రోఫోన్ శబ్ధమాలిన్యత మధ్య కమ్యూనికేషన్ స్ఫష్టంగా కొనసాగించేందుకు ఇవి ఉపయోగపడుతాయి.
ఏల్‌ఈడీ బ్యాటన్: రాత్రి సమయంలో రహాదారులపై ట్రాఫిక్ నియంత్రణ వాహానదారులకు స్ఫష్టమైన సూచనలు ఇవ్వడానికి వీటీ వినియోగం కీలకంగా ఉంటుంది.
నూతన టెక్నాలజీ సిస్టం : స్మార్ట్ టెక్నాలజీ ఆధారిత సిగ్నల్ కంట్రోల్ ట్రాఫిక్ ప్లో మానిటరింగ్ నెంబర్ ప్లేట్‌రిడిరగ్ టెక్నాలజీ వంటి వ్యవస్థలు అమలులో ఉన్నాయి
ప్రథమ చికిత్స కిట్లు : రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి తోలి క్షణంలో సహాయం చేయడానికై ప్రతి ట్రాఫిక్ వాహానాల్లో ఫస్టఎయిడ్ కిట్లు లభ్యమవుతాయి.ఈ ఆధూనిక పరికరాల అందజేతతో హైదరబాద్ నగర ట్రాఫిక్ విభాగం ఇతర రాష్ట్రలతో పోటీ పడుతుంది. రాబోయే రోజుల్లో ట్రాఫిక్ నియంత్రణను మరింత బలోపేతం చేయనున్నట్లు సమాచారం.
నగర ప్రజలకు మెరుగైన సేవలందించడమే మా లక్ష్యం.. పోలీస్ కమిషనర్ సి.వి.ఆనంద్. ఐపీఎస్
నగర అభివృద్ధిలో ట్రాఫిక్ నియంత్రణ ప్రధాన భాగం. పౌరుల సహాకారంతో దీన్ని విజయవంతం చేయగలం. రహాదారి నియమ నిబంధనలు వంటి అంశాల్లో ప్రజలు సహాకరిస్తే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గుతాయని ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే మా లక్ష్యం. ట్రాఫిక్ పోలీస్ ఆధునిక టెక్నాలజీతో పనిచేస్తేనే నగర రవాణ వ్యవస్థ సజావుగా నిర్వహించగలం. ఈ పరికరాల వినియోగం వల్ల ట్రాఫిక్ పోలీసుల పని మెరుగవుతుందని, సాంకేతిక పరిజ్ఞానం, వాడకం వల్ల వారు మరింత సమర్థవంతగా విధులు నిర్వహిస్తారు.