- పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు.
- బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్
దేశవ్యాప్తంగా సామాన్యులు, రైతులు, పేద, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు ప్రయోజనం చేకూర్చేలా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు ప్రకటించిన సందర్భంగా బిజెపి తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవి ప్రసాద్ గౌడ్ సీతాఫల్మండి అంబేద్కర్ విగ్రహం ముందు ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి ఆకారం రమేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కృతజ్ఞతలు తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ రేట్ల తగ్గింపు, ప్రక్రియల సంస్కరణల ద్వారా సామాన్యులు, రైతులు, ఎంఎస్‌ఎంఈలు, మధ్యతరగతి, మహిళలు, యువతకు నేరుగా ఆర్థిక ఉపశమనం కలిగే విధంగా ఉన్నదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ తెలిపారు.
జీఎస్టీ స్లాబ్‌లలో 12% మరియు 28% పన్నులను రద్దు చేయడం, అనేక నిత్యావసర వస్తువులపై పన్నును 5% లేదా జీరోకి తగ్గించడం వంటి నిర్ణయాల ద్వారా పేద, మధ్యతరగతి ప్రజలకు, మహిళలకు, యువతకు నేరుగా లాభం కల్పించడం లక్ష్యంగా ఉంది. పండుగల సమయంలో ఈ నిర్ణయాలు పేద కుటుంబాల జీవితంలో ఆర్థిక ఊరట కల్పిస్తాయని రవి ప్రసాద్ గౌడ్ తెలిపారు. కార్యక్రమంలో… కనకట్ల హరి. ప్రభుగుప్తా. డివిజన్ అధ్యక్షుడు నరేష్. అంబాల రాజేశ్వర్. నగరపు శామ్. నీలి శీను. సంపత్. చోట ప్రభు. చిలుకల సురేష్. కుమారస్వామి. డి. రమేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన జరిగింది.




