వివరాలు వెల్లడించిన డీసీపీ చంద్రమెహాన్
నకిలీ నోట్ల చలామణీ చేస్తున్న ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్దనుంచి నకిలీ నోట్ల స్వాధీనం చేసుకున్న సంఘటన హైదరాబాద్ కమిషనరేట్ సౌత్ వెస్ట్ జోన్ మెహిదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను డీసీపీ చంద్రమెహాన్, ఏసీపీ కిషన్‌కుమార్, ఇన్స్‌స్పెక్టర్ మల్లెష్ డీఐ బాలకృష్ణతో కలిసి వెల్లడించారు. మహారాష్ట్ర, ఔరంగాబాద్ కు చెందిన అన్సరీ ఆఫ్‌తాబ్ అజీముద్దీన్ 22, ఆదీల్‌హుసేన్ 22. వృత్తి స్టూడెంట్. ఔరంగాబాద్‌కు చెందిన ఆకాశ్, తదితరులు కలిసి నకలి కరెన్సీ చెలమణి చేస్తున్నరని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసులు శ్రీరాం నగర్ ఫస్ట్ లాన్స్‌ర్ బస్తీ వద్ద దర్యాప్తు చేయగా విషయం తెలిసింది. దీంతో వారు నిందితులు నోట్ల మార్పిడి కోసం వస్తున్నారని తెలిసి అక్కడే నిఘా ఏర్పాటు చేసి నిందితులు నోట్ల మార్పిడి చేస్తున్న సమయంలో రెడ్‌హ్యండ్ పట్టుకుని స్టేషన్ కు తరలించి విచారించగా నేరం అంగికరించారు. దీంతో వారి వద్దనుంచి నకిలి రూ.2లక్షలు, సెల్‌ఫోన్, హోండా యాక్టివా నెంబర్ టీఎస్.13ఈడబ్లూ, 8739, వాహానం, స్వాధీనం చేసుకని నిందితులను న్యాయస్థానం ముందు హాజరు పరిచి రిమాండ్‌కు తరలించారు. ఆకాశ్ అనే నిందితుడు ఫరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.