Friday, June 6, 2025
spot_img

‘అందాల రాక్షసి’.. ఈ నెల 13న రీరిలీజ్

Must Read

నవీన్ చంద్ర, హను రాఘవపూడి, వారాహి చలన చిత్రం కల్ట్ క్లాసిక్ “అందాల రాక్షసి” ఈ నెల 13న గ్రాండ్‌గా రీరిలీజ్ కాబోతోంది. ప్రేక్షకుల మనసుల్ని గెలిచిన ఈ ఎవర్ గ్రీన్ లవ్ స్టోరీ మరోసారి అలరించబోతోంది. నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్‌పై సాయి కొర్రపాటి, ఎస్‌.ఎస్‌. రాజమౌళి నిర్మించిన ఈ చిత్రం 2012 ఆగస్టు 10న విడుదలై ఘన విజయాన్ని సాధించింది.

భిన్నమైన ప్రేమ కథ, లోతైన భావోద్వేగాలతో ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు హను రాఘవపూడి. రధన్ మ్యూజిక్ ఎవర్ గ్రీన్ గా నిలిచింది. ఇందులో పాటలన్నీ సూపర్ హిట్ గా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడీ మ్యాజిక్ మళ్లీ బిగ్ స్క్రిన్ పై ఎక్స్‌పీరియన్స్ చేయడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Latest News

భక్తిని బిజినెస్‌గా మార్చిన ఘనుడు

రూ.2.15 కోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు గతేడాది జనవరిలో అయోధ్యలో జరిగిన బాల రామయ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా ఓ ఘనుడు భక్తుల విశ్వాసాన్ని బిజినెస్‌గా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS