Friday, August 15, 2025
spot_img

పెంచల్ రెడ్డి జీవిత కథతో రూపొందిన “ఆపద్భాంధవుడు”

Must Read

శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై పలు బాలల చిత్రాలు రూపొందించి ప్రేక్షకుల ఆదరణతో పాటు ప్రతిష్టాత్మక అవార్డ్ లు దక్కించుకున్నారు దర్శక నిర్మాత భీమగాని సుధాకర్ గౌడ్. ఆయన రచనా, దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “ఆపద్భాంధవుడు” శ్రీ పెంచల్ రెడ్డి. డి. లీలావతి నిర్మించారు. ఈ చిత్రంలో పెంచల్ రెడ్డి, సుధాకర్ గౌడ్, ఝాన్సీ, ప్రతిమ, నాగేశ్వరరావు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్రెస్ మీట్ ను ఈ రోజు హైదరాబాద్ ఫిలింఛాంబర్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

దర్శకుడు భీమగాని సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. వ్యాపారం, కుటుంబం, సమాజ సేవ.. ఈ మూడింటిని సమన్వయం చేసుకుంటూ సేవా రత్నగా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి శ్రీ పెంచల్ రెడ్డి గారు. ఆయన నాకు ఎంతో కాలంగా తెలుసు. దర్శకులుగా మనం సమాజం నుంచి, మన చుట్టూ ఉన్న వాళ్ల దగ్గర నుంచే స్ఫర్తి పొందుతాం. అలా మీ జీవితం ఆధారంగా లఘు చిత్రం రూపొందించాలని ఉంది అని అడిగినప్పుడు ఆయన నాకంటే గొప్పవాళ్లు ఎంతోమంది ఉన్నారు, నాకంటే ఎక్కువగా సేవ చేసిన వాళ్లున్నారు అని తిరస్కరించేవారు. చివరిసారి ప్రయత్నం చేసినప్పుడు మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఆయన మౌనాన్నే అంగీకారంగా తీసుకుని నేను “ఆపద్భాంధవుడు” చిత్రాన్ని రూపొందించాను. ఈ చిత్రంలో ఆయన నటించడం విశేషం. నేనూ ఆయన మిత్రుడిగా నటించాను. ఇది సజీవ పాత్రలతో సాగే ఫిలిం. దీన్ని బయోపిక్ లా, లైవ్ గా, సరికొత్త పద్ధతిలో తెరకెక్కించాం. నేటి బాలలే రేపటి పౌరులు అని నమ్మే నేను గతంలో ఆదిత్య క్రియేటివ్ జీనియస్, విక్కీస్ డ్రీమ్, డాక్టర్ గౌతమ్, అభినవ్ వంటి చిల్డ్రన్ ఫిలింస్ చేశాను. ఇప్పుడు మాస్టర్ సంకల్ప్ అనే చిల్ర్డన్ ఫిలిం చేశాం. సెప్టెంబర్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుపుతున్నాం. వయసైన పెద్దవాళ్లు కుటుంబ సభ్యుల నిరాదరణకు గురై వృద్ధాశ్రమాల్లో గడుపతున్నారు. వయోధికులు తమ సంపాదనను కేవలం వారసులకే కాకుండా కొంత సమాజ సేవకు ఉపయోగిస్తే ఎంతో ఆత్మసంతృప్తి పొందుతారు. అలాంటి ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి పెంచల్ రెడ్డి గారు. “ఆపద్భాంధవుడు” చిత్రాన్ని ఎన్నో ఇనిస్టిట్యూషన్స్ లో ప్రదర్శించాం. వాళ్లందరి దగ్గర నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ లఘు చిత్రం ప్రేక్షకుల్లో, సమాజంలో చైతన్యం తీసుకొస్తుంది. పెంచల్ రెడ్డి గారి లాంటి సమాజ సేవకులు ముందుకొచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఆయన పేద విద్యార్థులు, అన్నార్థులు, పేద మహిళలు..ఇలా ఎంతోమందిని ఛారిటీ ద్వారా ఆదుకున్నారు. “ఆపద్భాంధవుడు” వంటి సజీవ చిత్రాన్ని ఏపీ, తెలంగాణ, ఇండియన్ గవర్నమెంట్స్ అనుమతి ఇచ్చి వాలెంటరీ ఆర్గనైజేషన్స్ ద్వారా ప్రదర్శిస్తే ఎంతోమందిలో సేవాభావం కలిగించినవారం అవుతాం. విద్యార్థుల్లో, యువకుల్లో కూడా మనమూ పెంచల్ రెడ్డి గారిలా సేవ చేయాలనే స్పూర్తి కలుగుతుంది. శ్రీ లక్ష్మి ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్, సంతోష్ ఫిలింస్ బ్యానర్స్ పై ఏవో కమర్షియల్ సినిమా తీయొచ్చు, డబ్బు చేసుకోవచ్చు. కానీ డబ్బు కంటే సమాజానికి ఒక మంచిని చెప్పే సినిమా చేయడం ముఖ్యమని భావించాం అన్నారు.

సేవా రత్న శ్రీ పెంచల్ రెడ్డి మాట్లాడుతూ.. మాది వ్యవసాయ కుటుంబం. నేను చిన్న వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. జీవీకే కంపెనీ లో చిన్న ఉద్యోగిగా చేరి అంచలంచెలుగా ఎదిగాను. నా సంపాదనలో 50 శాతం విరాళాల రూపంలో సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నాను. ఈ సేవా కార్యక్రమాలే నాకు ఎంతో ఆత్మ సంతృప్తి ఇస్తున్నాయి. స్కూల్స్, కాలేజెస్, టెంపుల్స్, సీనియర్ సిటిజన్స్ అందరికి సహాయం చేస్తున్నాను. డైరెక్టర్ భీమగాని సుధాకర్ గౌడ్ గారు నా బయోపిక్ ని సినిమా రూపంలో తీస్తానన్నప్పుడు వద్దన్నాను. కానీ అయన వదలకుండా నన్ను ఒప్పించి సినిమా మొదలుపెట్టారు. నా శ్రీమతి లీలావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. నా జీవిత కథను సజీవ చిత్ర రూపంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న దర్శకులు భీమగాని సుధాకర్ గౌడ్ గారికి నా ధన్యవాదాలు తెలియచేస్తున్నా. ఆపద్భాంధవుడు లఘు చిత్రం ప్రేక్షకులకు స్ఫూర్తి కలిగించి, సేవా కార్యక్రమాలు చేయాలనే చైతన్యాన్ని కలిగిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

Latest News

రేవంత్ పాలనలో తెలంగాణ తిరోగమనం

పన్నుల భారం, ఆర్థిక క్షీణతపై హరీశ్ రావు తీవ్ర విమర్శలు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పన్నుల విధానంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS