దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
నవంబర్ 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాద్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా
వెల్లడించిన కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘవాల్
దేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. గురువారం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంజీవ్ ఖన్నాను...
మెట్రో స్టేషన్ కింద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
38 మంది అరెస్ట్
హైదరాబాద్‌లోని కూకట్పల్లి మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. సుమారుగా 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. మెట్రో స్టేషన్ కింద...
దీపావళి పండుగా నేపథ్యంలో సింగరేణి కార్మికులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు దీపావళి బోనస్ ఇవ్వనుంది. దీనికోసం రూ.358 కోట్లు విడుదల చేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రతి కార్మికుడి ఖాతాలో శుక్రవారం రూ.93,750 జమ కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు 42 వేల మంది కార్మికులు దీపావళి...
వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి బ్యాంక్ ఆఫ్ బరోడా రూ. 01కోటి రూపాయల విరాళం అందించింది. గురువారం జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బ్యాంక్ ఆఫ్ బరోడా జనరల్ మేనేజర్ రితేశ్ కుమార్, డిప్యూటీ జనరల్ మేనేజర్ ఎంవీఎస్ సుధాకర్ విరాళం చెక్కును అందజేశారు. వరద బాధితుల సహాయం...
గత వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు గురువారం ఎట్టకేలకు తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.550 తగ్గగా, 24 క్యారెట్లపై రూ.600 తగ్గింది. బులియన్ మార్కెట్ లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 72,850 నమోదవగా, 22 క్యారెట్ల ధర రూ.79,470గా నమోదైంది.
ఫిలిప్పిన్స్‌లో ట్రామి తుఫాను బీభత్సం సృష్టించింది. ఈ తుఫాను కారణంగా ఉత్తర ఫిలిప్పిన్స్‌లో వరదలు సంభవించాయి. కొండచరియాలు విరిగిపడడంతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆరుప్రావిన్స్ బికోల్ ప్రాంతంలో అత్యధిక మరణాలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. వందలాది కార్లు వరద ప్రవాహానికి కొట్టుకుపోయాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకులాయి. తుఫాన్ కారణంగా అప్రమత్తమైన అధికారులు...
దక్షిణ కాశ్మీర్‌లోని పూల్వమా జిల్లాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వలస కార్మికుడిపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో బాధితుడి చేతిలోకి బుల్లెట్ దూసుకుపోయింది. ప్రస్తుతం అయిన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితుడిని బిజ్నోర్ కు చెందిన శుభంగా గుర్తించారు. ఇదిలా ఉండగా గతవారం రోజుల్లో కాశ్మీర్లో కార్మికులపై దాడి జరగడం ఇది మూడోసారి.
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సీ ) ఛైర్మన్‌గా రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాధ బాద్యతలు స్వీకరించారు. గురువారం విజయవాడ బందర్ రోడ్డులోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో ని ఛాంబర్లో బాద్యతలు స్వీకరించారు. ఏపీపీఎస్సీ కార్యదర్శి ఆమెతో పదవి ప్రమాణస్వీకారం చేయించారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడి
రూ.720 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు చేస్తున్నామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని రైల్ నిలయంలో రైల్వే జీఎం అరుణ్‌కుమార్ తో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ,గతంలో ఎప్పుడులేని విధంగా దక్షిణ మధ్య రైల్వే బడ్జెట్‌ను పెంచామని అన్నారు. వచ్చే ఏడాది డిసెంబర్...
కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు బెయిల్ మంజూరు అయింది. తనపై జానీ మాస్టర్ లైంగికదాడి చేసినట్లు మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు జానీమాస్టర్ పై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. విచారించిన కోర్టు రిమాండ్ విధించడంతో జానీమాస్టర్‌ను చంచల్‌గూడ జైలుకు పంపించారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు...