ఆకుల అఖిల్, దర్శిక మీనన్, చిత్రం శ్రీను, గడ్డం నవీన్, చిట్టిబాబు, రేవతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘బాలుగాడి లవ్ స్టోరీ’. శ్రీ ఆకుల భాస్కర్ సమర్పణలో భామ క్రియేషన్స్ పతాకంపై ఆకుల మంజుల నిర్మిస్తున్న చిత్రానికి యల్. శ్రీనివాస్ తేజ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న బాలుగాడి లవ్ స్టోరీ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆగస్ట్ 8న విడుదల కాబోతోంది. ఈ సినిమాను ‘సిల్వర్ స్క్రీన్’ గణేష్ భారీ రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది, ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు జర్నలిస్ట్ ప్రభు, కిషోర్ దాస్, వినోద్ చౌదరి, శబరి నిర్మాత మహేంద్రనాధ్ హీరోయిన్ మేఘన, మా అసోసియేషన్ ఈసీ మెంబర్ మానిక్ , డైరెక్టర్ తల్లాడ సాయి తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. బాలుగాడి లవ్ స్టోరీ టైటిల్ బాగుంది, సాంగ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి, కొత్త నిర్మాతలకు సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ వెల్ కం చెబుతోంది, ఈ సినిమాతో ఈ చిత్ర నిర్మాత ఆకుల మంజుల పెద్ద విజయం సాధిస్తుంది అలాగే నూతన దర్శకులు ఎల్.శ్రీనివాస్ తేజ్ ఈ మూవీతో మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకోవాలని చిత్ర యూనిట్ సభ్యులందరికీ బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను, కంటెంట్ బాగున్న సినిమాలు ఎప్పడూ సక్సెస్ అవుతాయి, అదే తరహాలో బాలుగాడి లవ్ స్టొరీ సినిమా ప్రేక్షకాదరణ పొందాలని కోరుకుంటున్నా అన్నారు.
నిర్మాత ఆకుల మంజుల మాట్లాడుతూ.. మా అబ్బాయి ఆకుల అఖిల్ ఫస్ట్ టైమ్ హీరో అలాగే డైరెక్టర్ శ్రీనివాస్ తేజ్ ఫస్ట్ టైమ్ డైరెక్టర్ నేను ఈ సినిమాతో నిర్మాతగా మారాను ఇలా మా అందరికి బాలుగాడి లవ్ స్టొరీ ఫస్ట్ ఫిలిం, ఈ సినిమా విజయం సాధించి మా అందరికి మంచి పేరు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నా అన్నారు.
నిర్మాత ఆకుల భాస్కర్ మాట్లాడుతూ.. బాలుగాడి లవ్ స్టొరీ సినిమా నిజ జీవితంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు ఎల్.శ్రీనివాస్ తేజ్ గారు. ఘన శ్యామ్ గారు ఈ సినిమా కోసం సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చారు, హీరో హీరోయిన్ అఖిల్, దర్శిక మీనన్ చాలా చక్కగా నటించారు, ఆగస్ట్ 8న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలుగాడి లవ్ స్టొరీ సినిమాను థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
దర్శకుడు ఎల్.శ్రీనివాస్ తేజ్ మాట్లాడుతూ.. బాలుగాడి లవ్ స్టొరీ సినిమాను నిర్మాతలకు చెప్పిన వెంటనే నచ్చి వెంటనే ఓకే చేశారు. మెగాస్టార్ చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకొని నేను ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన స్పూర్తి తోనే సినిమాను డైరెక్ట్ చేశాను, ఈ సినిమాలో కామెడీ, లవ్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అందరూ నటీనటులు చాలా అనుభవం కిలిగిన వారిలాగా బాగా చేశారు. ఈ సినిమాతో ఆకుల అఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు, అతనికి మీ అందరి ఆదరణ బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరో ఆకుల అఖిల్ మాట్లాడుతూ.. మేము అందరూ వెయిట్ చేస్తున్న బాలుగాడి లవ్ స్టొరీ సినిమా ఆగస్ట్ 8న థియేటర్స్ లో రాబోతోంది, ప్రేక్షకులు మా సినిమాకు కనెక్ట్ అవుతారని నమ్మకం ఉంది, డైరెక్టర్ ఎల్.శ్రీనివాస్ తేజ్ గారు సినిమాను రియల్ ఇంసిడెన్స్ తో బాగా తీశారు, మా అందరికి మీ సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.
హీరోయిన్ దర్శిక మీనన్ మాట్లాడుతూ.. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు ఆకుల భాస్కర్ గారికి ఆకుల మంజుల గారికి దర్శకులు ఎల్.శ్రీనివాస్ తేజ్ గారికి ప్రేత్యేక కృతజ్ఞతలు. సినిమా చాలా బాగా వచ్చింది, మీ అందరికి నచ్చుతుందని నమ్ముతున్నాను, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ లభిస్తోంది సినిమా కూడా మీ అందరికి నచ్చుతుందని భావిస్తున్నాను అన్నారు.
ఆకుల అఖిల్, దర్శక మీనన్, చిత్రం శ్రీను, జబర్దస్త్ గడ్డం నవీన్, జబర్దస్త్ చిట్టిబాబు, రేవతి, లక్ష్మి, రాఘవరావు, మహేష్, సూరజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ శ్రీ ఆకుల భాస్కర్, బ్యానర్ భామ క్రియేషన్స్, రైటర్, డైరెక్టర్ యల్. శ్రీనివాస్ తేజ్, నిర్మాత ఆకుల మంజుల, డి.ఓ.పి రవి కుమార్ నీర్ల, మ్యూజిక్ డైరెక్టర్ ఘనశ్యామ్, ఎడిటర్ యాదగిరి కంజారాల లుగా వ్యవహరిస్తున్నారు.