ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా కేటీఆర్ నివాళులు
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా జీవితాన్ని అర్పించిన ఉద్యమ పురోగామి, విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఘనంగా నివాళులర్పించారు. న్యూఢిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాటం చేసి, ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను దేశానికి చాటి చెప్పిన ఘనత జయశంకర్ సార్‌దేనని గుర్తు చేశారు. తెలంగాణ ఆత్మగౌరవం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు జయశంకర్ సార్.. ఆయన ఆశయాలే ఈ రాష్ట్ర నిర్మాణానికి బీజాంశాలు అయ్యాయని కొనియాడారు. కేటీఆర్‌తో పాటు ఇతర బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.