తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాకు నిధులు మంజూరు చేసింది. రూ.50 కోట్ల నిధులను హైడ్రాకు మంజూరయ్యాయి. హైడ్రాకు సంబంధించిన వాహనాల కొనుగోలు,కార్యాలయ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
వర్ధంతి సభ మీడియా కో ఆర్డినేటర్ కౌటికె విఠల్
మాజీ ముఖ్యమంత్రి, వైశ్య జాతి శిఖామణి కొణిజేటి రోశయ్య వర్ధంతి సభను విజయవంతం చేయాలని సభ మీడియా కో-ఆర్డినేటర్, వైశ్యసంఘం నేత కౌటికె విఠల్ పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైశ్యజాతి రత్నం రోశయ్య సేవలు ఎనలేనివని ఆయన పేర్కొన్నారు. అజాతశత్రువుగా పేరొందిన రోశయ్య...
మాజీమంత్రి హరీష్ రావుపై కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేసి,అక్రమ కేసులు పెట్టి వేధించారని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో పంజగుట్ట పోలీసులు హరీష్ రావుపై 120బి,386,409 సెక్షన్ల కింద కేసు నమోదు...
సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటిస్తున్నారు. బండ తిమ్మాపూర్లో రూ.1000 కోట్లతో నిర్మించిన కోకాకోలా పరిశ్రమను అయిన ప్రారంభించారు. కోకాకోలా కూల్ డ్రింక్ తయారీ వివరాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. సీఎం వెంట మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ ఉన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి
గతంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రైతులకు రూ.2 లక్షల పంట రుణామాఫీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్నగర్లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు వేడుకలకు అయిన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో...
మహబూబ్నగర్ లో జరిగే రైతుపండుగ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా చూడండి.
https://www.youtube.com/live/_Bj-sPC5kIM?si=qaggo8drA6N632eS
సీఎం రేవంత్ రెడ్డి నేడు మహబూబ్నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. మహబూబ్నగర్ లో జరిగే రైతు పండుగ సభలో అయిన పాల్గొంటారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. "ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజు..పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు.. పోలింగ్ బూతుకు వెళ్లి “మార్పు” కోసం ఓటేశాడు. ఆ ఓటు...
రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు
పోలీసు యూనిఫాం అంటే నమ్మకం, క్రమశిక్షణకు గుర్తని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి డీ.శ్రీధర్ బాబు పేర్కొన్నారు. టీజీఎస్‌పీఎఫ్ సిబ్బంది పాసింగ్ అవుట్ పరేడ్ సందర్భంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ వద్ద ఉన్న శిక్షణ కేంద్రంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి అయిన ముఖ్యఅతిథిగా హాజరై పోలీస్ సిబ్బంది గౌరవ వందనం...
దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట
పూర్తిస్థాయి సిబ్బందితో గృహ నిర్మాణ శాఖ బలోపేతం
లబ్ధిదారు ఆసక్తి చూపితే అదనపు గదుల నిర్మాణానికి అనుమతి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమిలేని వారు, పారిశుద్ధ్య...
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భూసేకరణ చట్టం 2013లోని సెక్షన్ 93 ప్రకారం లగచర్లలో భూసేకరణను ఉపసంహరించుకున్నట్లు నోటిఫికేషన్ విడుదల చేసింది.