Saturday, July 12, 2025
spot_img

తెలంగాణ

కులగణనకు బిజెపి వ్యతిరేకం : ఎమ్మెల్సీ కవిత

కులగణనకు బిజెపి వ్యతిరేకమని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సోమవారం హైదరాబాద్‎లో డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ బుసాని వేంకటేశ్వరరావుకు ఆమె వినతిపత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కులగణనకు చట్టబద్దత ఉందోలేదో చెప్పాలని రాష్ట్రప్రభుత్వానికి డిమాండ్ చేశారు. కులగణనపై నెల రోజుల్లో నివేదిక అంటే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆన్నారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వ...

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు. తెలంగాణలో అధికారం చేపట్టి ఏడాది పూర్తికావస్తున్న సందర్బంగా డిసెంబర్ 09న నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలకు ఢిల్లీ పెద్దలను ఆహ్వానించనున్నారు. అదేవిధంగా సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సభకు ఢిల్లీ పెద్దలను ప్రత్యేకంగా పిలువనున్నారు. మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించే అవకాశం ఉంది.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు అందజేశారు. నవంబర్ 09న దళిత బంధు నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హుజూరాబాద్‎లో ధర్నా చేపట్టారు. అయితే ఎలాంటి అనుమతి లేకుండా ధర్నా చేపట్టినందుకు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలపై బీఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 35 (3) కింద పోలీసులు...

ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలి

రాష్ట్ర ప్రభుత్వానికి కేటీఆర్ డిమాండ్ ఆదానీపై కేసు పెట్టాలని ఎన్నిసార్లు కోరిన ప్రధాని మోదీ పట్టించుకోలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదానీ వ్యవహారంపై శుక్రవారం తెలంగాణ భవన్‎లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా ఆదానీ...

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‎పై హైకోర్టు తీర్పు

ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హత పై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ స్పీకర్‎కు హైకోర్టు సూచించింది. పదో షెడ్యూల్ ప్రకారం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దృష్టిలో ఉంచుకొని అనర్హత పిటిషన్‎లపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు...

ఏసీబీ వలలో సీనియర్‌ డ్రాఫ్ట్‌మెన్‌

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‎లో సీనియర్‌ డ్రాఫ్ట్‌మెన్‌ జ్యోతిక్షేమాబాయి రూ.20,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం, మహబూబాబాద్ పట్టణ శివారులోని మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు వరంగల్ జిల్లాకు చెందిన తాళ్ల కార్తీక్ భూమికి సంబంధించిన వివరాల కోసం గత నెల 28న...

పోలీస్ ఉద్యోగం..క్రమశిక్షణతో కూడుకున్నది

తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ పోలీస్‌ ఉద్యోగం అంటే క్రమ శిక్షణతో కూడుకున్నదని డీజీపీ డాక్టర్‌ జితేందర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌ ఆర్‌.బి.వీ.ఆర్‌ ఆర్‌, శిక్షణ సెంటర్‌ లో ఏర్పాటు చేసిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, న్యాయం కోసం న్యాయమైన...

హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట్ ఎయిర్‎పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జీష్నుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ జితేందర్, అధికారులు స్వాగతం పలికారు. నేడు, రేపు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో నేడు, రేపు హైదరాబాద్...

పోలీస్ పహరాలో మహబూబాబాద్ జిల్లా..144 సెక్షన్ అమలు

మహాబూబాబాద్ పట్టణంలో పోలీసులు భారీగా మోహరించారు. లగచర్లలో గిరిజన, పేద రైతులపై దాడికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండడంతో ఆందోళనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. గురువారం మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించినట్లు ఎస్పీ సుధీర్ రామ్‎నాథ్ కేకన్ తెలిపారు. జిల్లా...

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు

తిరుమల తిరుపతి దేవస్థానం ( టీటీడీ ) ఛైర్మన్ బీఆర్ నాయుడు గురువారం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ సీఎం నివాసానికి వెళ్ళిన అయిన రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించారు. అనంతరం శ్రీవారి ప్రసాదాన్ని అందించారు.
- Advertisement -spot_img

Latest News

ప్రత్యేక హెల్త్ క్యాంప్ లో మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం అని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం బంజారాహిల్స్ కొమురం భీం భవన్...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS