Saturday, August 2, 2025
spot_img

ట్రంప్‌పై వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ విచారం..

Must Read

అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌పై ఇటీవల తాను చేసిన వ్యాఖ్యల పట్ల ఎలాన్ మస్క్ విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తాను పెట్టిన పోస్టులు చాలా దూరం వరకు వెళ్లాయంటూ పశ్చాత్తాపం ప్రకటించారు. తన దూకుడు స్వభావం విషయమై ఎలాన్ మస్క్ వెనక్కి తిరిగి చూసుకోవటంతో వీళ్లద్దరి మధ్య నెలకొన్న వివాదం కాస్త చల్లారినట్లయింది. బిగ్ బ్యూటిఫుల్ బిల్లు కారణంగా ట్రంప్, మస్క్ మధ్య గొడవలు తలెత్తాయి. పరస్పరం మాటా మాటా అనుకున్నారు.

తాను లేకపోతే ట్రంప్ గెలిచేవారే కాదని మస్క్ రెచ్చగొట్టగా.. అంత సీన్ లేదని ట్రంప్ కూడా ఘాటుగానే బదులిచ్చారు. మస్క్ అంతటితో ఆగకుండా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు పరోక్షంగా ప్రకటించాడు. రిపబ్లికన్ లేజిస్లేచర్లకు వ్యతిరేకంగా డెమొక్రాట్లకు మస్క్ ఫండింగ్ చేస్తారనే వార్తలూ వచ్చాయి. దీంతో ట్రంప్ మరింత సీరియస్ అయ్యారు. అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో వీళ్లద్దరి మధ్య రోజురోజుకూ పెరుగుతున్న రగడ ఎక్కడికి దారితీస్తుందో అనే ఆందోళన నెలకొంది. కానీ.. మస్క్ కాస్త వెనకడుగు వేయటంతో హమ్మయ్య అనుకుంటున్నారు.

Latest News

రాష్ట్రాన్ని గాలికి వదిలి ఢిల్లీ రాజకీయాలకు ఎందుకు

బీసీ రిజర్వేషన్లపై డ్రామా కాదు, రాజ్యాంగబద్ధ పోరాటం జరగాలి దాసోజు, వకుళాభరణం ఆగ్రహం రాష్ట్రంలో పాలనను గాలికి వదిలేసి ముఖ్యమంత్రి ఢిల్లీలో రాజకీయ నాటకాలపై దృష్టి సారించడం తప్పుపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS