గాలే కాదు.. నీరే కాదు.. మనసంత కలుషితం.. అంతరాత్మ అంతరాలు తరచిచూస్తేకలుషితం.. మాటే కలుషితం చూపే కలుషితం.. మౌనంలో దాగున్న భావమెంత కలుషితం.. ఆత్మ చంపి జీవించే మనుషుల్లో కల్మషం.. స్వార్ధమున్న మనసుంటే మనిషంతా కలుషితం.. ఆచరణే సాధ్యమవని మాటలన్నికలుషితం.. తీర్చలేని వరాలిస్తె ప్రజాస్వామ్య కలుషితం.. ఆట పాట లేకుంటే బాల్యమంత కలుషితం.. హింస పెట్టి మురిసిపోతే ఆనందం కలుషితం.. తెలిసి కూడ తప్పు చేస్తె అనుభవమే కలుషితం.. సంస్కారం నేర్పలేని విద్యాబుద్ది కలుషితం.
!! మాటే కలుషితం చూపే కలుషితం!
- అందెల రవళి